పవన్ పక్కన హీరోయిన్ గా ఆమె చేయటానికి కారణం చిరంజీవి భార్య?
ఇటువంటి నేపథ్యంలో అప్పట్లో పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలోకి వచ్చిన సందర్భంలో నటించిన గోకులంలో సీత సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్ గా రాజీ నటించడానికి కల కారణం చిరంజీవి భార్య సురేఖ అంటూ తాజాగా ఇటీవల మా టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరోయిన్ రాశి తెలిపారు. ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో కెరియర్ పరంగా మంచి టైం లో ఉన్న సమయంలో..పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన నేపథ్యంలో చిరంజీవి భార్య సురేఖ గారు తనని ఇంటికి పిలిచారని తమ మరిది పవన్ పక్కన హీరోయిన్ గా నటించాలని కోరారని ఇటీవల రాశి తెలిపింది.
చాలా సందర్భాలలో పవన్ కళ్యాణ్ తన తల్లి లాంటిదని తన వదిన సురేఖ పేర్కొనటం జరిగింది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ అప్పట్లో ఖాళీగా ఉంటున్న సమయంలో సినిమాల్లోకి పంపించిన వదిన కెరియర్ పరంగా పవన్ కళ్యాణ్ కి మొదటిలో చాలానే సహాయం చేసినట్లు పవన్ కళ్యాణ్ సక్సెస్ అవ్వడానికి చాలా కృషి చేసినట్లు బయటకు వస్తున్న విషయాలు బట్టి తెలుస్తుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు...ఈ నేపథ్యంలో త్వరలో బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ డూపర్ హిట్ అయిన పింక్ అనే సినిమా తెలుగులో రీమేక్ చేయటానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.