సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పదహైదు ఏళ్లు గడుస్తున్నా కాజల్ అగర్వాల్ ఇప్పటికీ హాట్ బ్యూటీగానే అందరినీ అలరిస్తోంది. కెరీర్ పరంగా ఎన్నో సార్లు ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ బ్యూటీ తన అందం అభినయంతో ప్రతీ సారి తిరిగి మళ్లీ తన స్థానంలో నిలదొక్కుకుంది. ఒక దశలో ఇక కాజల్ కెరీర్ ముగిసనట్టే అనుకున్న సమయంలో సీనియర్ హీరోల సరసన ఆడిపాడేందుకు అంగీకరించి అందరికీ షాక్ ను ఇచ్చింది.
ఇటీవల లేడీ ఓరియంటెడ్ సినిమాల వైపు అడుగులు వేస్తున్న ఈ అందాల భామ అందుకు తగ్గట్టుగా సిద్ధమవుతోంది. యంగ్ జనరేషన్ భామలకు పోటి ఇచ్చేందుకు తెగ కాస్త పడుతోంది. తాజాగా ఈ చందమామ బ్యూటీ తన హాట్ వర్క్ అవుట్స్ వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. వారం రోజుల పాటు ఇబ్బంది పెట్టిన జ్వరం నుంచి రికవర్ అయ్యేందుకు శరీరంలోని జెమ్స్ ను వెళ్లగొట్టేందుకు బెస్ట్ వే అంటూ మూడు వర్క్ అవుట్ వీడియోస్ ను పోస్ట్ చేసింది కాజల్.
ప్రస్తుతం ఈ భామ చేతిలో 4 సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్ సూపర్ హిట్ క్వీన్ కు రీమేక్‌గా తెరకెక్కిన "పారిస్ పారిస్" సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీ అయిపోయింది. అయితే ఈ సినిమా ఆర్థిక సమస్యల కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ లేస్తోంది. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కుతున్న క్రాస్ ఓవర్ మూవీ కాల్ సెంటర్ తో పాటు హిందీ సినిమా ముంబై సాగా, తమిళ సినిమా ఇండియన్ 2 లో కూడా ఈ అందాల భామ నటిస్తోంది.
గత కొంత కాలంగా కాజల్ కు కాలం కలిసి రావటం లేదు. 2017 సంవత్సరంలో రిలీజ్ అయిన మెర్సల్ తర్వాత ఈ భామకు ఒక్క హిట్ కూడా దక్కలేదు. కాజల్ హీరోయిన్గా నటించిన అ..!, ఎమ్మెల్యే, కవచం, సీత, రణరంగం సినిమాలు ప్లాప్ అయ్యాయి. దీనితో తదుపరి చిత్రాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తోంది కాజల్ అగర్వాల్