ఆ విషయంలో చిన్మయి కన్నీరు పెట్టుకుంది!

siri Madhukar
ఈ మద్య సెలబ్రెటీలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని మీటూ ఉద్యమం ద్వారా ఉవ్వెత్తున్న ఆరోపణలు వెల్లువెత్తాయి.  తనూశ్రీ దత్తా తనను ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ పదేళ్ల క్రితం లైంగికంగా వేదించారని సంచలన ఆరోపణలు చేసింది. దాంతో ఈ వివాదం పెద్ద ఎత్తున తెరపైకి రావడంతో ఆమెకు బాసటగా చాలా మంది నటీ,నటులు ఇతర రంగాల వారు సంఘీబావం తెలిపారు.  దీనిపై నానా పటేకర్ కౌంటర్ ఇచ్చారు..తాను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పపడలేదని..తన వ్యక్తిగత జీవితంపై మచ్చతెచ్చేలా తనూశ్రీ దత్తా కామెంట్ చేసిందని ఉల్టా కేసు వేశారు.  ఇక మీటూ ఉద్యమం నేపథ్యంలో ప్రముఖ తమిళ గేయ రచయిత వైరాముత్తు తనను లైంగికంగా వేధించాడని ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద షాకింగ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

13 ఏళ్ల క్రితం వర్క్ ట్రిప్స్ నిమిత్తం వెళ్లినప్పుడు తనను వైరాముత్తు గదిలోకి రమ్మని వేధించాడని ఆరోపణలు చేసింది. అయితే చిన్మయి చేసిన ఆరోపణలకు  కోలీవుడ్ మొత్తం షాకైంది. ఇక వైరాముత్తును ఎవ్వరూ ఏమీ చేయలేకపోయారు. పైగా అతనిపై ఆరోపణలు చేసినందుకు చిన్మయిని డబ్బింగ్ యూనియన్ నుంచి తొలగించారు. తాజాగా ఈ విషయంపై మరోసారి తన ఆవేదన వ్యక్తం చేసింది చిన్మయి. అల్వార్‌పేటలో కమల్‌ హాసన్‌ నిర్వహించిన కె. బాలచందర్‌ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రజనీకాంత్‌తోపాటు వైరముత్తు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమల్‌, రజనీతో కలిసి వైరముత్తు తీసుకున్న ఫొటోను చిన్మయి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు.

  కాగా, సోషల్ మీడియాలో వచ్చిన ఈ ఫోటోను ఉద్దేశించి చిన్మయి సంచలన వ్యాఖ్యలు చేసింది. నిందితుడు వైరముత్తు వేడుకలకు హాజరవుతుంటే బాధితురాలిని చిత్ర పరిశ్రమ నుంచి నిషేధించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. పురుషులు చేసిన లైంగిక వేధింపుల వల్ల అవమానభారంతో చాలా మంది బయటకు కూడా రావడం లేదు. కానీ, వైరముత్తు మాత్రం డీఎమ్‌కే కార్యక్రమాలు, సినిమా వేడుకలు, పుస్తకావిష్కరణ మొదలైన వాటికి అతిథిగా వెళుతున్నాడు. అతడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఏ మాత్రం ప్రభావం చూపలేదు. నన్ను మాత్రం చిత్ర పరిశ్రమ నుంచి నిషేధించారు...తమిళ చిత్ర పరిశ్రమ పెద్దలు బాగా న్యాయం చేశారని కన్నీరు పెట్టుకుంది. 

auto 12px; width:50px;">
view this post on Instagram
“MeToo has ruined the lives of the men accused for sexual harassment” 😂😂😂😂😂 (FYI - I am referring to {{RelevantDataTitle}}