మహేష్, చరణ్ బాటలోనే జూనియర్ ఎన్టీఆర్..!
తాజాగా ఇప్పుడు ఇదే బాటలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా వస్తున్నట్లు ఒక పక్క సినిమాలు చేస్తూ మరో పక్క వ్యాపారంలో కూడా రాణించాలని ఆలోచిస్తున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా సొంత నిర్మాణ సంస్థని స్థాపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ ఫ్యామిలీ 'ఎన్టీఆర్ ఆర్ట్స్' అనే నిర్మాణ సంస్థ ఉంది. దీని బాధ్యతలు కళ్యాణ్ రామ్ చూసుకుంటున్నాడు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా ఓ బ్యానర్ మొదలుపెట్టాలని భావిస్తున్నాడు. మహేష్ బాబులానే తన సినిమాల నిర్మాణంలో పాలు పంచుకునే దిశగా ఎన్టీఆర్ అడుగులు వేయబోతున్నట్లు సమాచారం.
మంచి రోజు చూసుకొని నిర్మాణ సంస్థకు సంబంధించిన ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి వస్తున్న వార్తల్లో వాస్తవం ఉందో తెలియాలంటే జూనియర్ ఎన్టీఆర్ స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం రాజమౌళి దర్శకత్వంలో rrr సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అయిన వెంటనే సౌత్ ఇండియాలో సూపర్ సెన్సేషనల్ హిట్ సినిమా తెరకెక్కించిన కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేయడానికి ఎన్టీఆర్ రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.