బన్నీ ఖాతాలో సరికొత్త రికార్డు!

siri Madhukar
టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్.  ఆయన తాతయ్య ప్రముఖ హాస్య నటులు అల్లు రామలింగయ్య.  ఎన్నో సినిమాల్లో తనదైన కామెడీ మార్క్ చాటుకున్న అల్లు రామలింగయ్య తనయుడు అల్లు అరవింద్ నటుడిగా వెండి తెరకు పరిచయం అయినా..తర్వాత నిర్మాతగా మారి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు.  అల్లు అర్జున్ చిన్ననాటి నుంచి సినీ వాతావరణంలో పెరగడంతో సినిమాలపై మక్కువతో రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘గంగోత్రి’ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు. 

ఆ తర్వాత దేశముదురు, ఆర్య, బన్ని ఇలా వరుస హిట్స్ తో పాపులారిటీ పెంచుకున్నాడు. డ్యాన్స్, ఫైట్స్ లో తన ప్రత్యేకత చాటుకున్నాడు.  నాపేరు సూర్య సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అలా వైకుంఠపురములో’ సినిమా నటిస్తున్నాడు.  ఈ మూవీలో బన్ని సరసన పూజా హెగ్డే నటిస్తుంది. ఇటీవ‌ల మూవీకి సంబంధించి సామ‌జవ‌ర‌గ‌మ‌నా, రాములో రాములా.. అనే సాంగ్స్‌ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. క్లాసికల్ మ్యూజిక్ కి వెస్ట్రన్ టచ్ ఇచ్చి థమన్ స్వరపర‌చిన సామ‌జ‌వ‌ర‌గ‌మ‌నా సాంగ్ ప్రేక్షకులకు అమితంగా నచ్చేసింది. యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేసింది. ఈ పాట 7 లక్షలకి పైగా లైక్స్ ను యూట్యూబ్ లో దక్కించుకుంది. 

ఈ మూవీకి థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.  అయితే తెలుగులో ఓ పాట‌కి ఇన్ని లైక్స్ రావ‌డం ఇదే తొలిసారి.  ప్ర‌స్తుతం సామ‌జ‌వ‌ర‌గ‌మ‌నా సాంగ్ షూటింగ్ కోసం యూనిట్ అంతా యూర‌ప్‌లో ఉంది. అక్క‌డ బ‌న్నీ లిడో డాన్స‌ర్స్‌తో క‌లిసి స్టెప్పులేసారు. గ‌త 25 సంవ‌త్స‌రాలుగా ఎంతో ఫేమ‌స్ అయిన లిడో డాన్స్‌ని బ‌న్నీ చేయ‌డంతో తాజాగా ఆయ‌న ఖాతాలో మ‌రో రికార్డ్ న‌మోదైంది.  ఈ మూవీలో  సుశాంత్, నివేదా పేతురాజ్, టబు, జయరామ్‌ తదితరులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. అల్లు అరవింద్, ఎస్‌. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 
Eagerly waiting for #samajavaragamana song. This song makes special for the film😘💞😍 my favorite jodi is always super Jodi @hegdepooja @alluarjun pic.twitter.com/H4JgC0dm9D

— Kasi Sekhar (@Kasi1996) November 9, 2019 ..Because a song like #samajavaragamana deserves nothing less than the #eiffeltower... @alluarjun and I can’t wait for you’ll to see it 😃 #alavaikunthapurramuloo ❤️ pic.twitter.com/XgFbFCOrqI

— pooja hegde (@hegdepooja) November 9, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: