కన్ఫ్యూజన్ లో పడ్డ అల్లు అర్జున్ మరియు మహేష్ అభిమానులు..?
ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో మంచి వాతావరణం క్రియేట్ అయ్యేవిధంగా తనవల్ల హీరోల అభిమానుల మధ్య గొడవలు రాకుండా ఉండాలి అని భావించి అల్లు అర్జున్ ఈ సినిమాని సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదల అవుతున్న రోజు కాకుండా అనగా జనవరి 12వ తారీకున కాకుండా మరుసటి రోజు విడుదల చేయాలనే ఆలోచనలో నిర్ణయం తీసుకున్నట్లు ఫిలింనగర్లో వినబడుతున్న టాక్. ఇందుమూలంగా నే మలయాళం పోస్టర్లో సినిమా విడుదల తేదీ ప్రకటించకుండా అల్లుఅర్జున్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మరోపక్క మహేష్ బాబు కూడా సరిలేరు నీకెవ్వరు సినిమా జనవరి 12వ తారీకున కాకుండా ముందే విడుదల చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో వీరిద్దరు హీరోల అభిమానులు సినిమా రిలీజ్ తేదీలు మారుతున్నాయని వార్తలు రావడంతో చాలా కన్ఫ్యూజన్ లో పడుతున్నారు.