నమ్రత రికమండేషన్ తో అదిరిపోయే ఛాన్స్ కొట్టేసిన మెహర్ రమేష్!
ఈ సినిమా రైట్స్ కోసం బయ్యర్లు పోటాపోటీగా ముందుకు వస్తున్నారు. అలాంటి సినిమా గుంటూరు రైట్స్ ని మెహర్ రమేష్ తీసుకోవటంతో ఇండస్ట్రీ ఆశ్చర్యపోయింది. అయితే ఈ రైట్స్ ని నమ్రత దగ్గరుండి ఇప్పించిందని సమాచారం. తమ కుటుంబానికి సన్నిహితంగా ఉంటున్న మెహర్ రమేష్ కు సాయిం చేయటానికి ఆ రైట్స్ ఇప్పించిందని వినికిడి. ఆ రైట్స్ తో ఇప్పుడు మెహర్ రమేష్ జాక్ పాట్ కొడుతున్నాడని అంటున్నారు.
థియోటర్ అడ్వాన్స్ ల రూపంలోనే ఆయన పెట్టుబడి వచ్చేసిందని, మిగతాదంతా లాభమే అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది . ఇదే క్రమంలో ఓవర్సీస్ హక్కులు గ్రేట్ ఇండియా ఫిలింస్ వారు దక్కించుకున్నట్లు సమాచారం అందుకున్న నైజాం హక్కులకోసం ఇండస్ట్రీకి చెందిన ఓ బడా నిర్మాత దక్కించుకోవటానికి భారీ రేట్ పెట్టడానికి రెడీ అయినట్లు ఫిలింనగర్ లో వినబడుతున్న టాక్. జనవరి 12వ తారీకున సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.