వెంకీ మామను తిట్టి పోసుకుంటున్న నిర్మాతలు !

Seetha Sailaja
‘ఎఫ్ 2’ సక్సస్ తరువాత వెంకటేష్ నాగచైతన్యతో కలిసి నటిస్తున్న ‘వెంకీ మామ’ మూవీ రిలీజ్ కు రెడీ అయినా ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్ డిసెంబర్ లో విడుదల కాబోతున్న సినిమాలు అన్నింటిని కన్ఫ్యూజ్ చేస్తోంది. డిసెంబర్ లో విడుదల కావలసిన అనేక సినిమాల డేట్స్ వాయిదా పడటానికి ‘వెంకీ మామ’ కన్ఫ్యూజన్ ప్రధానకారణం అని అంటున్నారు. 

ఈ సినిమాకు స్పష్టమైన రిలీజ్ డేట్ ను ఇవ్వకుండా ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్న విధానాన్ని చూసిన వారు మాత్రం ఇప్పటికీ ఈ సినిమాకు సంక్రాంతి సీజన్ పై కన్ను ఉందా అన్న సందేహాలు కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు ఒక పాటను రిలీజ్ చేసారు. దీనికితోడు ఈమధ్య ఒక టీజర్ ను కూడ వదిలారు. 

ఇది చాలదు అన్నట్లుగా 1980 కాలంనాటి రోజులను గుర్తుకు చేసే ‘ఎన్నాళ్ళకో ఇలా’ అంటూ సాగే ఒక పాటను ఈరోజు విడుదల చేస్తున్నారు. దీనితో రిలీజ్ డేట్ ఫిక్స్ కాని సినిమాకు ప్రమోషన్ ఏమిటి అంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు. డిసెంబర్‌ 13న అంటే వెంకటేష్‌ పుట్టినరోజు కాబట్టి ఆరోజు వస్తుందని లేదంటే డిసెంబర్‌ 20 లేదా డిసెంబర్‌ 25న వస్తుందని రకరకాల డేట్స్ లీకులు ఇస్తూ ‘వెంకీ మామ’ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. 

దీనితో డిసెంబర్ ను నమ్ముకున్న చాలామంది హీరోలు దర్శక నిర్మాతలు ‘వెంకీ మామ’ ను తిట్టిపోసుకుంటున్నారు. వివాదాలకు అత్యంత దూరంగా ఉండే వెంకటేష్ తన లేటెస్ట్ మూవీ విషయంలో మాత్రం ఇలా వివాదాలను ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నాడో అర్ధంకాక వాస్తవానికి ఈ మూవీ నిర్మాత సురేశ్ బాబు మనసులో ఏముందో తెలియక చాలామంది తల పట్టుకుంటున్నారు. అయితే వ్యూహాలు రచించడంలో చాల తెలివైన సురేశ్ బాబు మనసులో ఎదో బయటపడని ఎత్తుగడ ఉంది అంటూ కామెంట్స్ హల్ చల్ చేస్తున్నాయి..   



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: