బాలీవుడ్ ఇండస్ట్రీ హీరోలను హీరోయిన్లను ఆదుకుంటున్న సౌత్ ఇండస్ట్రీ!
ఇటీవల వరుస ప్లాప్ లలో ఉన్న బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ అర్జున్ రెడ్డి సినిమా ని రీమేక్ చేసి అద్భుతమైన హిట్ అందుకున్నాడు. అదేవిధంగా అప్పట్లో సల్మాన్ ఖాన్ ఇండస్ట్రీ నుండి దుకాణం సర్దేసే పరిస్థితులు ఉన్న తరుణంలో...పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాను వాంటెడ్ సినిమాగా బాలీవుడ్ లో రీమేక్ చేసి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ప్రస్తుతం బాలీవుడ్లో తిరుగులేని హీరోగా దూసుకుపోతున్నారు. అదేవిధంగా అమీర్ ఖాన్ కూడా కెరియర్ పరంగా ఫుల్ పరాజయాల లో ఉన్న సమయంలో గజిని సినిమా ని రీమేక్ చేసి మంచి హిట్ అందుకున్నాడు.
అదేవిధంగా హీరోయిన్ల పరంగా కూడా చాలామంది కెరియర్ పరంగా డౌన్ ఫాల్ వచ్చిన సమయంలో సౌత్ లో సినిమాలు తీసి ప్రస్తుతం కెరీర్ కొనసాగిస్తున్నారు. ఒకానొక సమయంలో సౌత్ లో వెలుగు వెలిగిన హీరోయిన్లు కాజల్ అగర్వాల్, ఇలియానా, శృతిహాసన్….బాలీవుడ్ ఇండస్ట్రీ పై మోజుపడి సౌత్ లో వచ్చిన అవకాశాలని వదులుకొని బీ టౌన్ లో సినిమాలు చేసి పరాజయం పాలయ్యాయి ప్రస్తుతం సౌత్ లో రి-ఎంట్రీ ఇచ్చి వరుస ఆఫర్లు దక్కించుకుంటూ కెరియర్ కొనసాగిస్తున్నారు. ఈ విధంగా సౌత్ ఇండస్ట్రీ కి సంబంధించిన కథలు మరియు ప్రేక్షకులు కెరియర్ పరంగా డౌన్ ఫాల్ అవుతున్న బాలీవుడ్ హీరోలను మరియు హీరోయిన్లను ఆదుకుంటున్నారు.