‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాలో హైలెట్ సీన్?
ఇదిలా ఉండగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో హైలెట్ సీన్ ఇదే అని ఫిలిం నగర్ లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. విషయంలోకి వెళితే గతంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పరిపాలన లో రాంగోపాల్ వర్మ తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా అడ్డుకోవడం జరిగింది. అయితే ఆ ఎపిసోడ్ కి సంబంధించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా అడ్డుకున్న తీరుని కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రంలో రామ్ గోపాల్ వర్మ చూపించనున్నారట.
ముఖ్యమంత్రిగా కొత్త నాయకుడు జగన్ పాత్రధారి ముఖ్యమంత్రి అయ్యే దగ్గరి నుండి సినిమా మొదలవుతుందని అన్నారు. అయితే ప్రస్తుత రాజకీయాలు తెరకెక్కిస్తూ. భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అనే విధంగా తెరకెక్కించడం జరిగింది. అయితే ఇది రెండు కులాలకు మధ్య జరిగిన పోరులాగ ఉండటం తో ఈ చిత్ర టైటిల్ పై పోలీస్ కేసు నమోదయిన విషయం అందరికి తెలిసిందే. రాజకీయంగా మరియు పార్టీల పరంగా ఈ సినిమా విడుదల విషయంలో చాలామంది రాజకీయ నాయకులు మరియు అదే విధంగా సినిమా ప్రేక్షకులు సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.