'అలా వైకుంఠపురం లో' సినిమాలో అతని క్యారెక్టర్ హైలెట్..?
గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో తమన్... అరవింద సమేత వీర రాఘవ రెడ్డి సినిమా చేయగా తాజాగా రెండోసారి ఈ సినిమాతో అద్భుతమైన మ్యూజిక్ అందించడంతో 'అలా వైకుంఠపురం లో' సినిమాకి తమన్ సంగీతం హైలెట్ అని సినిమా విడుదల కాకముందే ఇండస్ట్రీలో కామెంట్ వినబడుతున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాలో అల్లు అర్జున్ తో పాటుగా అక్కినేని సుశాంత్ నటించడంతో….సినిమాలో సుశాంత్ పాత్ర సినిమాకి హైలైట్ అవుతుందని...ముఖ్యంగా అల్లు అర్జున్ తో సుశాంత్ నటించే సన్నివేశాలు అద్భుతంగా త్రివిక్రమ్ చిత్రీకరించారని..సుశాంత్ ‘అలా వైకుంఠపురం లో’ సినిమాకి హైలెట్ అని సినిమా విడుదల కాకముందే ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి.
సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమా పై అల్లు అర్జున్ అభిమానులు భీభత్సమైన అంచనాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా గురూజీ త్రివిక్రమ్ దర్శకత్వంలో గతంలో బన్నీ నటించిన రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో...అలా వైకుంఠపురం లో సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని బన్నీ అభిమానులు ఆశిస్తున్నారు.