వర్మపై కేఏ పాల్ అటాక్.. హైకోర్టులో పిటిషన్

Murali

వివాదాస్పద దర్శకుడు ఎవరంటే ఇండియా మెత్తమ్మీద చెప్పే ఒకే ఒక్క పేరు రామ్ గోపాల్ వర్మ. ఆంధ్రా నుంచి అమెరికా వరకూ.. కామన్ మేన్ నుంచి సీఎం వరకూ ఎవరినీ వదలడు ఆర్జీవీ. ప్రస్తుతం ఆర్జీవీ ట్రెండ్ చేస్తున్న అంశం.. ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమా. ఈ సినిమాలో ఆయన సమకాలీన ఏపీ రాజకీయాల్లోని వారిని ఎవరినీ వదల్లేదు. ఇందులో ఒక పాత్రగా కేఏ పాల్ ను చూపాడు వర్మ. ఇప్పుడిదే వివాదమయ్యేలా ఉంది. కేఏ పాల్ తన పాత్రను చూపిన విధానం గురించి రామ్ గోపాల్ వర్మపై హైకోర్టులో పిటిషన్ వేయడమే ఇందుకు కారణం.

 

 

‘కమ్మరాజ్యంలో - కడపరెడ్లు’ సినిమాలో తన క్యారెక్టర్‌ను అవమానపరిచే విధంగా చూపించారంటూ కేఏ పాల్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ క్యారెక్టర్ ను చూపడం ద్వారా తన మనోభాన్ని దెబ్బ తీశారని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ పిటిషన్ లో కోరాడు. ఇందులో ప్రతివాదులుగా కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ, సెన్సార్ బోర్డు, రామ్ గోపాల్ వర్మ, జబర్దస్త్ కమెడియన్ రాము, తదితరులను చేర్చాడు. కేఏ పాల్ వేసిన పిటిషన్ పై హైకోర్టులో కాసేపట్లో విచారణకు రానుంది. . ఈ నెల 29న కమ్మరాజ్యంలో కడప రెడ్లు విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కేఏ పాల్ వేసిన పిటిషన్ చర్చనీయాంశమైంది. దీనిపై హైకోర్టు ఏం తీర్పు ఇవ్వనుందోనని ఆసక్తి నెలకొంది.

 

 

రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాలో పాల్ నుంచి చంద్రబాబు, లోకేశ్, జగన్, పవన్.. ఇలా అందరిపై క్యారెక్టర్లు పెట్టాడు. ఇవి వారికి సంబంధించినవి కావు.. కేవలం పాత్రలు మాత్రమే అని చెప్తున్నాడు వర్మ.  ఇప్పటికే విడుదలైన ఈ సినిమా రెండు ట్రైలర్లు సంచలనాలు నమోదు చేస్తున్నాయి. దీంతో.. ఈ సినిమా భవితవ్యం ఇప్పుడు హైకోర్టు తీర్పును బట్టు ఉండబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: