ఆడియో రంగం లో ఊ హించని ట్విస్ట్ ఇచ్చిన మహేష్ 1

Seetha Sailaja
కొత్త సంవత్సరంలో సంక్రాంతికి రానున్న మహేష్ ‘1’ నేనొక్కడినే విడుదల కాకుండానే రికరుదుల మోత మోగిస్తోంది. మొన్న మగళవారం ఈ సినిమాకు సంబంధించిన యాప్ ఆండ్రాయిడ్ ద్వారా విడుదల చేసిన 18 గంటలలో ఈ యాప్ ను పదివేల సార్లు డౌన్ లోడ్ చేయడమే కాకుండా ఒకరోజు పూర్తి కాకుండానే రెండు లక్షల హిట్స్ రావడం టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డుగా మారింది అని అంటున్నారు.ఇవన్నీ ఇలా ఉండగా ఈనెల డిసెంబర్ 19న విడుదల కాబోతున్న ఈ సినిమా ఆడియో గురించి మరో కొత్త విషయం బయటకు వచ్చింది.  ఈ సినిమా ఆడియోను బెంగుళూర్ కు చెందిన లహరి సంస్థ ఏకంగా కోటి రూపాయల ధరకు ‘వన్’ ఆడియో రేట్లను కొనుగోలు చేయడం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఇప్పటివరకు ఆడియో రిట్లలో రామ్ చరణ్ నటించిన ‘మగధీర’, ‘రచ్చ’ సినిమాలు 60-75 లక్షల మధ్య ఆడియో హక్కులకు ధర పలికితే అప్పట్లో ఆ రెట్లనే టాలీవుడ్ రికార్డు అనుకున్నారు. అయితే అందరి అంచనాలను తల్లక్రిందులు చేస్తూ ఇప్పటివరకు తెలుగులో ఏసినిమా హీరో ఆడియోకు పలకనంత ఫాన్సీ రేట్ ‘వన్’ సినిమా పాటల ఆడియోకి రావడం సంచలనంగా మారింది. అంతేకాకుండా ‘వన్’ ఆడియో లాంచ్ ప్రమోషన్ ఖర్చును కూడా ఈ లహరి సంస్థ భరించడానికి ఒప్పుకుందట.  ఇంత భారీ స్థాయిలో లహరి ఈ సాహసానికి చేయడానికి గల కారణం ఈ సినిమా ఆడియో ఒక మాదిరిగా హిట్ అయినా మహేష్ బాబుకు ప్రస్తుతం ఉన్న క్రేజ్ రీత్యా కాలర్ ట్యూన్స్, డిజిటల్ డౌన్ లోడ్స్, ఫిజికల్ సేల్స్ ద్వారా కనీసం రెండు కోట్ల పైన ఆదాయం వస్తుందని లహరి ఆడియో సంస్థ మాస్టర్ ప్లాన్ అని అంటున్నారు.ఇలా ప్రతి విషయంలోను రికార్డులను క్రియేట్ చేస్తున్న ‘1’ సంక్రాంతికి ఇంకా ఎన్ని అద్భుతాలు చేస్తుందో చూడాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: