నాగచైతు కొత్త సినిమా టీజర్‌ను విడుదల

Suma Kallamadi

అక్కినేని మూడోతరం హీరో నాగచైతన్య తనదైన సైలిలో సినిమాలను ఎంచుకుంటూ నిర్మాతల నమ్మకాన్ని నిలబెడుతూ తన సినీ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. మజిలీ సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న నాగచైతన్య ప్రస్తుతం మరో ఎమోషనల్‌ డ్రామాలో హీరోగా నటిస్తున్నాడు. కాఫీ లాంటి చిత్రాల దర్శకుడు శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తన తదుపరి చిత్రం చేస్తున్నాడు ఈ యంగ్ నాగచైతన్య. సాయి పల్లవి హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌తో పాటు నాగచైతన్యకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు చిత్ర బృందం.

 

శనివారం చైతూ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్‌ ఈ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇంకా పేరు నిర్ణయించిని ఈ సినిమాను ప్రస్తుతం ఎన్‌సీ 19గా వ్యవహరిస్తున్నారు. ద వరల్డ్‌ ఆఫ్‌ ఎన్‌సీ 19 పేరుతో రిలీజ్‌ చేసిన ఈ టీజర్‌లో సినిమాలో చైతూ క్యారెక్టర్‌ ఎలా ఉండబోతుందో రివీల్‌ చేశారు. మాస్‌ లుక్‌ లో కనిపిస్తున్న చైతూను పెదవాడిగా పరిచయం చేశారు చిత్ర వర్గం.

పిల్లలతో కలిసి ఆనందంగా ఎంజాయ్‌ చేస్తున్న సీన్‌తో పాటు ఎమోషనల్‌గా కన్నీళ్లు పెట్టుకున్న సీన్స్‌ తో టీజర్‌ను ఆసక్తికరంగా రూపొందించారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై నారాయణ దాస్‌ నారంగ్‌, పీ రామ్‌ మోహన్‌రావులు సంయుక్తంగా నిర్మించబోతున్నారు. సీహెచ్‌ పవన్‌ సంగీతమందిస్తున్నాడు.

 

 

ప్రస్తుతం నాగ చైతన్య రియల్‌ లైఫ్‌ మామ వెంకటేష్‌ తో కలిసి వెంకీ మామ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటోంది. బాబీ దర్శకత్వంలో సురేష్‌ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాను డిసెంబర్‌లో రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ కూడా చేస్తున్నారు. ఈ సినిమాను ఎప్పుడు పూర్తి చేస్తారు అన్న విషయం మాత్రం ఇంకా చిత్ర బృందం మాత్రం పూర్తి వివరాలు తెలపలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: