సరిలేరు నీకెవ్వరు లోని టాప్ సీక్రెట్ ను బయటపెట్టిన అనీల్ రావిపూడి !
‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ హంగామా కొనసాగుతూనే ఉంది. ఈ నేపధ్యంలో ఈసినిమాకు ఏర్పడిన మ్యానియాను మరింత పెంచడానికి దర్శకుడు అనీల్ రావిపూడి ఈసినిమాకు సంబంధించిన ఒక టాప్ సీక్రెట్ ను బయట పెట్టాడు. సినిమాలో ఎవరు ఊహించని ఒక ట్విస్ట్ ఉంటుందని ఆ ట్విస్ట్ అజయ్ పాత్ర ద్వారా ఉండబోతున్నట్లు ఒక లీక్ ఇచ్చాడు.
ఈమూవీలో అజయ్ పాత్ర మహేష్ పాత్రకు ట్విస్ట్ ఇవ్వడమే కాకుండా మహేష్ పాత్రను ఎలివేట్ చేసే విధంగా ఉంటుందనీ ఎవరు ఊహించని విధంగా ఉండటంతో ధియేటర్ లో ఈమూవీని చూసే ప్రేక్షకులకు మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం అని అంటున్నారు. అంతేకాదు ఈసినిమాలో ఒక్క విజయ్ శాంతి పాత్ర మినహా మహేష్ తో సహా అందరు కామెడీ పంచ్ లు వేస్తారనీ ఆకామెడీకి ప్రేక్షకులు విపరీతంగా నవ్వుకోవడం ఖాయం అని అంటున్నారు.
ముఖ్యంగా సీరియస్ గా నటిస్తూ ఆ సీరియస్ నటనలోనే కామెడీని పలికించే ప్రకాష్ రాజ్ నట విశ్వరూపం ఈ సినిమాలో కనిపిస్తుందనీ అందుకోసమే ప్రకాష్ రాజ్ ను హైలెట్ చేస్తూ ఈ టీజర్ లో ఒక సీన్ పెట్టిన విషయాన్ని వివరించాడు. మరీ ముఖ్యంగా రష్మిక మహేష్ ల మధ్య లవ్ ట్రాక్ తో పాటు కామెడీ ట్రాక్ కూడ ఈ మూవీకి కీలకం అంటూ త్వరలో మహేష్ రష్మికల పై కట్ చేసిన ఒక సపరేట్ టీజర్ ను విడుదలచేయబోతున్న విషయాన్ని వివరించాడు.
ఇక ఈమూవీ ప్రమోషన్ ఎక్కడా గ్యాప్ లేకుండా ప్రతివారం ఈసినిమాకు సంబంధించి ఎదో ఒక టీజర్ లేదంటే మేకింగ్ వీడియోలను రిలీజ్ చేస్తూ ఈమూవీకి మరింత క్రేజ్ తీసుకు రాబోతున్నట్లు అనీల్ రావిపూడి లీకులు ఇస్తున్నాడు. అంతేకాదు ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ఎవరు ఊహించని రీతిలో చాల విభిన్నంగా డిజైన్ చేయడమే కాకుండా ఒక ఓపెన్ గ్రౌండ్ లో జనం మధ్య అత్యంత భారీ ఏర్పాట్లతో చేయబోతున్న విషయాలను వివరించాడు అనీల్ రావిపూడి..