500 కోట్ల హీరో విడాకుల ముచ్చట...

Seetha Sailaja
బాలీవుడ్ టాప్ హీరో హృతిక్ రోషన్, ఆయన భార్య సుశానేల మధ్య మనస్పర్థలు వచ్చాయని త్వరలో వీరిద్దరు విడిపోవాలని అనుకుంట్లున్నట్లు ఆ మధ్య బాలీవుడ్‌లో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను హృతిక్ చాల సార్లు ఖండిస్తూ వచ్చాడు. కానీ నిన్న శుక్రవారం హృతిక్ ఈ వార్తను నిజం చేశాడు. తాను తన భార్య నుండి విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.  ఈ వార్తతో బాలీవుడ్ షేక్ అయింది. సుశానే నా నుంచి విడిపోవాలని నిర్ణయించుకుంది. దీంతో 17 ఏళ్ల మా బంధం నేటితో ముగిసింది. ఈ సమయంలో మమ్మల్ని ప్రశాంతంగా వుండనీయమని మీడియాను కోరుతున్నాను అని అన్నాడు హృతిక్. ఇంతకీ ట్విస్ట్ ఏమిటంటే హృతిక్ తన 13వ వివాహ వార్షికోత్సవానికి కొన్ని రోజుల ముందుగా ఈ సంచలన విషయం ప్రకటించడం టాపిక్ ఆఫ్ ది బాలీవుడ్ గా మారింది. హృతిక్-సుశానేలకు రెహాన్(7), హ్రిదాన్(5) అని ఇద్దరు కుమారులున్నారు. సుజానే ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ ఖాన్ కూతురు. 2000లో వీరి పెళ్లి జరిగింది  అయితే పెళ్లికన్నా నాలుగేళ్లు ముందునుంచే ఇరువురికీ పరిచయం వున్నట్లుగా తెలుస్తోంది. అందుకే పెళ్లయి 13ఏళ్లే అవుతున్నప్పటికీ హృతిక్ తన 17 ఏళ్ల అనుబంధానికి తెరపడిందిఅని చెప్పడం వెనుక కారణం ఇదీ అని అంటున్నారు. హృతిక్ విదేశాల్లో ప్రియురాలు వుందని ఈ విషయం పైననే ఈ మధ్య వారు తరుచు తగువులు పడుతున్నారని వీరిద్దరూ విడిపోవడానికి ఇదే కారణం అంటోంది బాలీవుడ్ మీడియా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: