ఆర్ఆర్ఆర్ సినిమా షాకింగ్ అప్ డేట్...?

Reddy P Rajasekhar

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీయార్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్ నటిస్తూ ఉండగా జూనియర్ ఎన్టీయార్ కు జోడిగా ఐర్లాండ్ కు చెందిన ఒలీవియా మోరిస్ నటిస్తోంది. దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. 2020 సంవత్సరం జులై 30వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. 
 
ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తూ ఉండగా జూనియర్ ఎన్టీయార్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. ఒకే కాలానికి, వేరు వేరు ప్రాంతాలకు చెందిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీం కలిసి స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసి ఉంటే ఏ విధంగా ఉంటుందనే ఊహాజనితమైన కథతో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా 70 శాతం షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. 
 
కొన్ని రోజుల క్రితం ఆర్ఆర్ఆర్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న సమయంలో రామ్ చరణ్, అలియాభట్ మీద ఒక ప్రణయ గీతం చిత్రీకరిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటివరకు అలియాభట్ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో పాల్గొనలేదని సమాచారం. రాజమౌళి హీరోయిన్లతో తీయాల్సిన పార్ట్ తప్ప మిగతా భాగం చిత్రీకరించాడని సమాచారం. అలియా భట్ ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాల్గొనకపోవటంతో గతంలో ప్రణయ గీతం చిత్రీకరిస్తున్నారని వచ్చిన వార్తలు నిజం కాదని చెప్పవచ్చు. 
 
పది భాషలలో ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమాను రాజమౌళి జులై 30వ తేదీన విడుదల చేస్తానని ప్రకటించినప్పటికీ సినిమా రిలీజ్ డేట్ మారే అవకాశం ఉందని సమాచారం. ప్రేక్షకుల్లో ఆర్ఆర్ఆర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తి టైటిల్ రాజమౌళి డిసెంబర్ 31వ తేదీన లేదా 2020 జనవరి 1వ తేదీన కొమరం భీం ఫస్ట్ లుక్ తో పాటు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. 
 
. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: