అధ్యక్ష పదవిపై నరేష్ సంచలన వ్యాఖ్యలు.?
గత కొన్నేళ్ల నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో విభేదాలు తారాస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. గతంలో శివాజీ రాజా మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆ తర్వాత అధ్యక్షుడు మారిన తర్వాత వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి అని అందరూ అనుకున్నారు. కానీ మా అధ్యక్షుడిగా నరేష్ ఎన్నికైన తర్వాత కొన్ని రోజులపాటు సైలెంట్ గానే ఉండటంతో వివాదాలను సద్దుమణిగాయి అనుకున్నారు. కానీ గత కొన్ని రోజులుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా లో విభేదాలు మరోసారి తారస్థాయికి చేరుకున్నాయి. మా అధ్యక్షుడు నరేష్ లేకుండానే జనరల్ సెక్రటరీగా ఉన్న జీవితా రాజశేఖర్ బాడీ మీటింగ్ నిర్వహించడం తో ఒక్కసారిగా మా వివాదాలు భగ్గుమన్నాయి .
దీనిపై మా అసోసియేషన్ సభ్యులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆర్టిస్టుల సంక్షేమం కోసం ఏర్పాటుచేసిన మా అసోసియేషన్ ని అసోసియేషన్ సభ్యులు అందరూ వివాదాలతో నిర్వీర్యం చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు పలువురు సభ్యులు. మా అసోసియేషన్ సభ్యులు గా ఉన్నందుకు సంతోషపడాలో బాధపడాలో అర్థం కావట్లేదు అంటూ తెలిపారు. అయితే తాజాగా మా అధ్యక్షుడు సీనియర్ నటుడు నరేష్ వివాదాలపై స్పందించారు. తను అధ్యక్ష పదవినుంచి దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నరేష్.
అంతమాత్రాన మా అసోసియేషన్ నుంచి తనను ఎవరు బయటకు పంపలేదు అంటూ స్పష్టం చేశారు ఆయన. ఎందుకంటే తాను సభ్యుల ఓట్లతోనే అధ్యక్షుడు ఎన్నికయ్యాను అంటూ నరేష్ తెలిపారు.మా అసోసియేషన్లో శత్రువులు లేరని...తాను అజాతశత్రువును అంటూ నరేష్ వ్యాఖ్యానించారు. రఘుపతి వెంకయ్య నాయుడు సినిమా విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీనియర్ నటుడు మా అధ్యక్షుడు నరేష్ మా లో నెలకొన్న వివాదాలపై ఈ విధంగా స్పందించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది రాజకీయ పార్టీ కాదని దానిని కేవలం సేవా సంస్థగా మాత్రమే భావించాలి అంటూ ఆయన అన్నారు. చిరంజీవి కృష్ణంరాజు మురళీమోహన్ లాంటి పెద్దల సహకారంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లోని అందరిని కలుపుకుని ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు నరేష్. అయితే మా అధ్యక్షుడిగా తాను ఎన్నికైన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాను అంటూ ఆయన అన్నారు.