గుప్పెడంత 'ఆర్య-2' ప్రేమకు 10ఏళ్లు

Murali

టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ది ప్రత్యేకమైన ప్లేస్. మెగా బలంతో వచ్చినా తనకంటూ ఓ స్టైల్ క్రియట్ చేసుకుని ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు. డ్యాన్సులతో, స్టైలిష్ లుక్స్ తో తెలుగులోనే కాకుండా మళయాళంలోనూ భారీ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు. స్టైలిష్ కథలతో ఆకట్టుకునే అల్లు అర్జున్ తన కెరీర్లో నటించిన బెస్ట్ కథల్లో ఆర్య2 సినిమా ఒకటి. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విడుదలై నేటికి 10ఏళ్లు పూర్తయ్యాయి.

 

 

2009 నవంబర్ 27న విడుదలైన ఈ సినిమా హిట్ మూవీగానే కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ గా పేరు తెచ్చుకుంది. టిపికల్ కాన్సెప్ట్ ను అంతే టిపికల్ స్క్రీన్ ప్లేతో ప్రెజంట్ చేసే సుకుమార్ ఆర్య2ను అంతే స్టైలిష్ గా తెరకెక్కించాడు. ఫ్రెండ్ షిప్ ను, లవ్ ను ఒకే ఫ్రేమ్ చూపించడం ఈ సినిమా ప్రత్యేకత. సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సూపర్బ్. అన్ని పాటలు హిట్ అయ్యాయి. పాటల్లో బన్నీ చేసిన డ్యాన్స్ మూమెంట్స్ బన్నీని స్టార్ డ్యాన్సర్ గా మార్చేశాయి. ఫస్టాఫ్ లో సిటీ కల్చర్, సెకండాఫ్ లో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా యూత్ కు విపరీతంగా కనెక్ట్ అయింది.

 

 

బన్నీ కెరీర్లో ఆర్యకు ప్రత్యేక స్థానం ఉంది. ఆర్యతో బన్నీ స్టార్ హీరో అయ్యాడు. కానీ ఆర్య ప్యూర్ లవ్ సబ్జెక్ట్ అయితే ఆర్య2 ఫ్రెండ్ షిప్ అండ్ లవ్ కాన్సెప్ట్. దీంతో ఆర్య2కు అభిమానులు ఎక్కువ. ఆర్యకు మించి హిట్ కాలేకపోయినా.. బన్నీకి, అభిమానులకు, సుకుమార్ కు ఈ సినిమా ఓ స్వీట్ మెమరీ. అల్లు అర్జున్ ఈ సినిమాపై తన ప్రేమను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నాడు.

[08:57, 11/27/2019] murali Jio:

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
A Fan made Minimalistic {{RelevantDataTitle}}