నిఖిల్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన చిరంజీవి!

siri Madhukar

టాలీవుడ్ లో ఫ్యామిలీ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు నిఖిల్.  ఆ తర్వాత ఒకటీ రెండు సినిమాల్లో నటించినా పెద్దగా వర్క్ ఔట్ కాలేదు.  యాంకర్, నటి స్వాతి జంటగా ‘స్వామిరారా’ మూవీతో హీరో నిఖిల్ కి మంచి అదృష్టం కలిసి వచ్చింది.  ఆ తర్వాత కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడ, కేశవ ఇలా వరుస విజయాలతో దూసుకు వెళ్లాడు.  ఒకటీ రెండు ఫెయిల్యూర్స్ ఎదురైనా నిఖిల్ కి హీరోగా మంచి స్థానం దక్కింది.  అయితే ఆ మద్య ముద్ర మూవీతో ప్రేక్షకుల ముందుకు రావాలని చూసినా ఆ మూవీ టైటిల్ విషయంలో కాంట్రవర్సీ వచ్చింది.  అప్పటికే ముద్ర టైటిల్ తో జగపతిబాబు నటించిన సినిమా రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత 'అర్జున్ సురవరం’గా టైటిల్ మార్చారు.  ఈ మూవీ కూడా రిలీజ్ అప్పుడూ..ఇప్పుడూ అనుకుంటూ పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు.  

 

మొత్తానికి ఈ మూవీ రిలీజ్ కి సిద్దమైంది.  ఈ నేపథ్యంలో ఘనంగా మంగళవారం రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్.హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా‌లో జరిగిన ఈ ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా హాజరై సందడి చేశారు. అలాగే, తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి హీరో నిఖిల్ చేసిన చిన్నపనికి భారీగానే షాక్ ఇచ్చాడు.  మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..నేను ముందుగా మాట్లాడాల్సిన వ్యక్తి.. ఇప్పటి వరకు ఎగ్టైట్‌మెంట్‌లో ఏదేదో మాట్లాడేశాడు అంటు ఉండగానే నిఖిల్ ఆయన చెవిలో ఏదో చెప్పాడు.  

 

అంతే చిరంజీవి చిరు నవ్వు చిందిస్తూనే నిఖిల్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. చూశారా! కంగారు, నాకేదో మతిమరుపు అనుకుని తన పేరు నా చెవిలో చెబుతున్నాడు.  ఇక్కడ కూడా నన్ను గౌరవిస్తున్నాడు అనుకుంటే అనుమానిస్తున్నాడు అనేశారు. నాకు వయసు అయ్యిందని అనుకుంటున్నాడేమో.. అతన్ కేవలం నిఖిల్ అనే చెప్పాడు.  కానీ అతని పేరు నిఖిల్ సిద్దార్థ అని నాకు గుర్తు. ఏది కరెక్ట్ అంటూ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఆసక్తికరంగా మాట్లాడారు చిరంజీవి. దాంతో పక్కనే ఉన్న నిఖిల్ ముఖం చిన్నబోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: