తెలంగాణ ఆర్టీసీ సంపూర్ణేష్ బాబుని కూడా గడగడలాడించింది... !

Reddy P Rajasekhar

ఈరోజు ఉదయం సమయంలో ప్రముఖ కామెడీ చిత్రాల హీరో సంపూర్ణేష్ బాబు ప్రమాదానికి గురయ్యారు. తెలుస్తున్న సమాచారం మేరకు తాత్కాలిక డ్రైవర్ నడుపుతున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు సంపూర్ణేష్ బాబు అతని కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తున్న కారును ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. సంపూర్ణేష్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో ప్రయాణిస్తున్న సమయంలో సిద్ధిపేట్ కొత్త బస్టాండ్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. 
 
ఈ ప్రమాదంలో సంపూర్ణేష్ బాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం సంపూర్ణేష్ బాబు, ఆయన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్వల్ప గాయాలు మాత్రమే కావటంతో సంపూర్ణేష్ బాబు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మహాత్మ సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించిన సంపూర్ణేష్ బాబు హృదయ కాలేయం సినిమాతో హీరోగా టాలీవుడ్ కు పరిచయమయ్యారు. 
 
హృదయ కాలేయం సినిమా సూపర్ హిట్ కావడం, నిర్మాతలకు భారీ లాభాలను అందించడంతో సంపూర్ణేష్ బాబుకు వరుస ఆఫర్లు వచ్చాయి. కొన్ని సినిమాల్లో సంపూర్ణేష్ బాబు ప్రత్యేక పాత్రల్లో నటించాడు. కరెంట్ తీగ, సింగం 123, జ్యోతిలక్ష్మి, రాజా ది గ్రేట్, దేవదాస్ సినిమాల్లోని పాత్రలు సంపూర్ణేష్ బాబుకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. కొన్నిరోజుల క్రితం సంపూర్ణేష్ బాబు నటించిన కొబ్బరిమట్ట సినిమా విడుదలైంది. 
 
దాదాపు నాలుగు సంవత్సరాలు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా సంపూర్ణేష్ బాబు కెరీర్లో మరో హిట్ గా నిలిచింది. ఈ సినిమా నిర్మాతకు భారీగా లాభాలు వచ్చాయి. కొబ్బరిమట్ట హిట్ కావటంతో కొందరు నిర్మాతలు సంపూర్ణేష్ బాబుతో సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. జూనియర్ ఎన్టీయార్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 1 లో కూడా సంపూర్ణేష్ బాబు పాల్గొన్నారు. ప్రస్తుతం సంపూర్ణేష్ బాబు టక్కరి దొంగ చక్కని చుక్క అనే సినిమాలో నటిస్తున్నారని సమాచారం. సంపూర్ణేష బాబు కారు ప్రమాదానికి పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: