90ఎంఎల్ః ఈ సినిమా స్టోరీ ఇంత తేడానా
ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన హీరో కార్తికేయ. మొదటి చిత్రంతోనే యూత్‌లో మంచి పేరు సాధించిన ఈ హీరో ప్రస్తుతం మరో చిత్రంలో నటిస్తున్నారు. కార్తికేయ క్రియేటివ్ వర్స్ తన సొంత బ్యానర్లో మరో చిత్రంలో నటిస్తున్నారు ఆ చిత్రం పేరు 90 ఎం.ఎల్. యంగ్ హీరో కార్తికేయ, నేహా సోలంకి హీరో హీరోయిన్లుగా నూతన దర్శకుడు యెర్రా శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ashok REDDY' target='_blank' title='అశోక్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మాతగా లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్ రెడ్డియెర్రా మీడియాతో ముచ్చటించారు.
90ఎంఎల్ కథేంటి?
టైటిల్ 90ఎంఎల్ అని పెట్టడం వలన ఇది ఓ తాగుబోతుల చిత్రం లేదా ఆల్కహాల్ కి సంబంధించిన చిత్రం అనుకోవచ్చు. కాని ఇది అలా కాదు. మందు ఖచ్చితంగా తాగాల్సిన అవసరం ఉన్న ఒక పేషెంట్ పాత్రను తీసుకొని సినిమా తీయడం జరిగింది. ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం తీసిన కల్పిత కథ మాత్రమే.
మీకు దర్శకుడిగా మొదటి చిత్రం అనుకుంటా?
అవును…, దర్శకుడిగా ఇది నా మొదటి చిత్రం. గతంలో ఐదు సినిమాలకు అసిస్టెంట్, అసోసియేట్ డైరెక్టర్ గా చేశారు. చాలా సినిమాలకు రైటర్ గా పనిచేసిన అనుభవం ఉంది. దర్శకత్వ మరియు రైటింగ్ డిపార్ట్మెంట్స్ లో పనిచేసిన అనుభవం వుంది.
కార్తికేయతో మూవీ చేసే అవకాశం ఎలా వచ్చింది.?
ఆర్ఎక్స్ 100 మూవీ దర్శకుడు అజయ్ భూపతి నాకు మిత్రుడు. ఆ మూవీ చిత్రీకరణ సమయం నుండే నాకు కార్తికేయతో పరిచయం ఉంది. నేను ఈ స్క్రిప్ట్ సిద్ధం చేసిన తరువాత ఆయనకు వినిపించడంతో ఈ మూవీ ఒకే చేశారు.
టైటిల్ 90ఎంఎల్ అని పెట్టడం వలన ఒక వర్గపు ఆడియెన్స్ సినిమా చూడరేమో కదా?
అంటే ఏ సినిమా అయినా మార్నింగ్ షో పడ్డాక, ఆ మూవీ సబ్జక్ట్ ఏమిటనేది తెలిసిపోతుంది. అలాగే అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పించేలా సినిమా తీయలేం. కొన్ని సినిమాలు యూత్ కి నచ్చితే మరికొన్ని ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతాయి.
ఈ చిత్రంతో మద్యపానాన్ని ప్రోత్సహిస్తున్నారా?
ఈ చిత్రంలో హీరోకి ఆరోగ్య రీత్యా ఆల్కహాల్ తప్పనిసరి అని చెప్పడం జరిగింది. అంతేకాని సినిమాలో మద్యపానాన్ని ప్రోత్సహించేలా సన్నివేశాలు కానీ, కామెడీ సన్నివేశాలు కానీ తీయలేదు. 90ఎం ఎల్ కంప్లీట్ లవ్ స్టోరీ. టైటిల్ అలా పెడితే, మద్యపానాన్ని ప్రోత్సహిస్తున్నట్లు కాదు.
హీరో కార్తికేయ పాత్ర ఎలా ఉంటుంది?
కార్తీకేయ నటించిన గత చిత్రాలైన గుణ 369, ఆర్ఎక్స్ 100 లలో యాక్షన్ మరియు ఎమోషనల్ కోణంలోనే అతన్ని ఎక్కువగా చూపించడం జరిగింది. ఈ మూవీలో వాటితో పాటు కామెడీ కూడా కార్తీకేయ చేయడం జరిగింది. కార్తీక్ కామెడీ టైమింగ్ చాలా బాగుంది. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది.
హీరో, నిర్మాత ఏమైనా మార్పులు చేర్పులు చెప్పారా?
అలా ఏమి చెప్పలేదు. నేను మొదట వారికి నెరేట్ చేసిన స్క్రిప్ట్ యధాతథంగా తెరకెక్కించాను.
నెక్స్ట్ ఎవరితో చేస్తున్నారు?
నెక్స్ట్ ప్రాజెక్ట్ అనేది ఇంకా ఎవరితో కన్ఫర్మ్ కాలేదు. ప్రస్తుతం నా ఫోకస్ అంతా ఈ చిత్రంపైనే. నన్ను నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ నా చేతిలో పెట్టారు. అందుకే ఈ చిత్రం విడుదల తరువాత నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తా.
ఈ సినిమా ఎవరికి ప్లస్ అవుతుంది హీరోకా మీకా?
కార్తికేయకి ఇది ఒక మంచి కమర్షియల్ సినిమా గా మంచి హిట్ అవుతుంది. అలాగే మంచి విజయం సాధిస్తే ఒక కొత్త దర్శకుడిగా నాకు హిట్ అనే చెప్పాలి.
అజర్ భాయిజాన్ మూవీ సెట్లో షూటింగ్?
అజర్ భాయిజాన్ సెట్లో ఈ చిత్రంలోని 4 పాటల చిత్రీకరణ జరిగాయి. దానికి కారణం మాకు ఆ ప్లేస్ బాగా నచ్చింది దాంతో అక్కడ షూట్ చెయ్యవలసి వచ్చింది.