ఆ దర్శకుడిపై మోజుపడిన శ్రీ రెడ్డి.. నువ్వే కావాలంటూ..

Kavya Nekkanti

సంచలన తార శ్రీ రెడ్డి ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై తనదైన శైలిలో వ్య‌వ‌హ‌రిస్తోంది శ్రీరెడ్డి. కాస్టింగ్ కౌచ్ పేరుతో సినీ ఇండస్ట్రీలో మహిళలపై వేధింపులు జరుగుతున్నాయంటూ గత కొద్దిరోజుల క్రితం సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆమె తెలుగు సినిమా నటులు, దర్శకులు, టెక్నీషియన్లు అనుకునే అందరిపైనా అత్యంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసింది. ఈ క్ర‌మంలోనే త‌న వ్యాఖ్య‌ల‌తో తెలుగు సినీ ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపేసింద‌ని చెప్పాలి. ఇక సోషల్ మీడియా వేదికగా విరుచుకు పడుతూ ఎవ‌రికి ప‌డితే వారికి స్ట్రాంగ్ వార్నింగ్స్‌ ఇస్తుంటుంది.

అయితే ఎప్పుడూ సీరియస్‌గా ఎవరో ఒకర్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసే శ్రీ రెడ్డి.. ఈ సారి మాత్రం ఆమెలోని రొమాంటిక్ కోణం బయటికి వచ్చింది. ఉన్నట్లుండి సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మనసు పారేసుకుంది శ్రీ రెడ్డి. ఏమైందో తెలియదు కానీ అందరికీ తెలిసేలా సోషల్ మీడియాలోనే వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. ఏకంగా తన ఫేస్‌బుక్ పేజీలో రామ్ గోపాల్ వర్మతో డేటింగ్ చేయాలని ఉందని చెప్పేసింది శ్రీ రెడ్డి. అయితే అక్కడితో ఆగితే ఆమె శ్రీరెడ్డి ఎందుకు అవుతుంది. కాకరేపు హాట్ ఫొటోలను షేర్ చేసి తనదైన శైలిలో బూతు పోస్ట్‌లు వదలింది.

ఓ షార్ట్ ఫ్రాక్‌లో తన భారీ ఎదను కెమెరాకు విరివిగా వదిలేసి కవ్వించే కళ్లతో చేతిలో పెద్ద స్టిక్ పట్టుకుని.. మత్తుగా చూస్తూ.. ‘నా వెనుక రామ్ గోపాల్ వర్మ ఉన్నట్టు .. చాలా క్రేజీగా డ్రైవ్ చేసి’ అంటూ శ్రీరెడ్డి మార్క్ పోస్ట్ పెట్టింది. ఇది చూసి నెటిజన్లు కూడా పరేషాన్ అవుతున్నారు. అయితే శ్రీ రెడ్డి పోస్ట్ చూసిన తర్వాత కొందరు మాత్రం ఇద్దరిదీ భలే కాంబినేషన్.. ఆయన ఎవర్ని పట్టించుకోడు.. ఈమె ఎవర్నీ వదిలిపెట్టదు.. ఇద్దరి కాంబినేషన్ అదుర్స్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరి శ్రీ రెడ్డి ఇచ్చిన ఆఫర్‌ను వర్మ ఎలా స్పందిస్తాడో చూడాలి. ప్ర‌స్తుతం ఆయ‌న  కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా ప‌నుల్లో బిజాగా ఉన్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: