హాట్ న్యూస్ గా మారిన కళ్యాణ్ రామ్ వార్నింగ్ !

Seetha Sailaja

‘పటాస్’ మూవీ తరువాత కళ్యాణ్ రామ్ నటుడుగా నిర్మాతగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు ఏమీ పెద్దగా ఫలితాలు ఇవ్వలేదు. అయినప్పటికీ కళ్యాణ్ రామ్ తన ప్రయత్నాలు ఆపడం లేదు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ నటిస్తున్న ‘ఎంత మంచి వాడవురా’ మూవీ షూటింగ్ పూర్తి అయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కు రెడీ అవుతోంది. 

ఈ మూవీని ఎట్టి పరిస్థితులలోను సంక్రాంతి రేస్ లో దింపి మహేష్ బన్నీల వార్ మధ్య ఉండితీరతాను అని కళ్యాణ్ రామ్ గట్టి పట్టుదలతో ఉన్నట్లు టాక్. సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్న ఈమూవీ ‘శతమానం భవతి’ రేంజ్ లో హిట్ అవుతుందనీ కళ్యాణ్ రామ్ చాల గట్టిగా నమ్ముతున్నాడు.  

ఇప్పటికే ‘అల వైకుంఠపురములో’ ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ ప్రమోషన్స్ మొదలై దూసుకు పోతున్న నేపధ్యంలో కళ్యాణ్ రామ్ ‘ఎంత మచి వాడవురా’ మూవీ అతడికి తెలియకుండానే సైడ్ లైన్ అయిపోతోంది. ఈ మూవీ తాలుకు స్టిల్స్ అప్పుడప్పుడు విడుదల అవుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. 

దీనితో ఈ విషయాలను గ్రహించిన కళ్యాణ్ రామ్ తన సినిమాకు ఎగ్రెసివ్ ప్రమోషన్ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈమూవీ ప్రమోషన్ విషయంలో జరిగిన నష్టం చాలని ఇకపై ఏమాత్రం ఆలస్యం చేయకూడదని ఈ మూవీ నిర్మాతలకు కళ్యాణ్ రామ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఈ మూవీ పాటలను డిసెంబర్ 6వ తారీఖు నుండి విడుదల చేస్తూ ఈ మూవీ విడుదలకు 3 వారాల ముందు నుంచే తనే స్వయంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించి ప్రచారం చేయడమే కాకుండా ఈ మూవీ క్రేజ్ ను ఫ్యామిలీ ప్రేక్షకులలో పెంచడానికి కళ్యాణ్ రామ్ ఒక స్పెషల్ పిఆర్ టీమ్ ను ఏర్పాటు చేసి తాను కూడ బన్నీ మహేష్ లకు ఏ విషయంలోనూ తీసిపోను అంటూ సంకేతాలు ఇవ్వడానికి ఒక స్థిర నిర్ణయం తీసుకున్నట్లు టాక్.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: