విజయ్ దేవరకొండ 'దిశ' ఘటన పై సంచలన వ్యాఖ్యలు..?

Kunchala Govind

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న దిషా సంఘటనపై టాలీవుడ్ లో పలువు స్పందిస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టర్ స్పందిస్తూ ఇలాంటి వారిని నడి రోడ్డుమీదే ఉరి తీయాలి ఆవేదన వ్యక్తం చెరశారు. ఇందుకు పూర్తి విరుధంగా దర్శక, రచయిత పోసాని కృష్ణ మురళి..చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఇలా టాలీవుడ్ లో అనుష్క, కీర్తి సురేష్, పూనం కౌర్, మహెష్ బాబు, రాం, కార్తికేయ..వంటి సెలబ్రిటీస్ అందరు ఎంతో తీవ్రంగా విమర్శించారు. ఇక అర్జున్ రెడ్డి డైరెక్టర్ కూడా ఇటీవల స్పందించగా నెటిజన్లు తీవ్రంగా ఆ డైరెక్టర్ పై విరుచుకు పడ్డారు. ముందు మీరు మంచి సినిమాలు తీసి ఆ తర్వాత నీతులు చెప్పండి అంటూ ఘాటుగా సమాధానం చెప్పారు. ఇప్పుడు యంగ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఈ సంఘటనపై ఎంతో ఎమోషనల్ గా స్పందించాడు. మగవారు ఇంత రాక్షసంగా తయారు అవ్వడంపై విజయ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రతి ఒక్కరు కూడా మానవత్వంతో మెలగాలని.. మనుషులు మనుషులుగా ప్రవర్తించనప్పుడు వారికి మానవ హక్కులు ఎలా వర్తిస్తాయంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించాడు. 

 

ఈ విషయమై ట్విట్టర్ లో విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. మన అనుకున్న వారు ఎవరైనా ఆపదలో ఉన్నారని అనిపిస్తే లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అనిపిస్తే వారితో ఎక్కువగా ఫోన్ లో టచ్ లో ఉండటం మంచిది. మనుషులుగా ప్రవర్తించని మానవ మృగాలు చాలా మంది ఉన్నారు. అలాంటి వారికి అసలు మానవ హక్కులను వర్తింపజేయాల్సిన అవసరం లేదు అంటూ విజయ్ దేవరకొండ తన వ్యక్తిగ అభిప్రాయం వ్యక్తం చేశాడు. మానవ హక్కులను పక్కన పెట్టి అలాంటి వారిని కఠినంగా శిక్షించాలంటూ విజయ్ కోరాడు.

 

మరో వ్యక్తి ఇలాంటి ఘోరాలకు పాల్పడాలంటే భయపడేలా నిందితులను శిక్షించాలని విజయ్ దేవరకొండ చెప్పాడు. మన చుట్టు ఉన్న వారిలో ఎవరైనా తప్పుగా ఆలోచిస్తే మనం సరిదిద్దాల్సింది పోయి వారిని సమర్ధిస్తూ వారికి మద్దతుగా నిలవద్దంటూ కోరాడు. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతో ఉండాలని.. సమాజం పట్ల ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలంటూ ఈ సందర్బంగా విజయ్ దేవరకొండ పేర్కొన్నాడు. మరీ ఇలా చెప్పిన డైరెక్టర్ ని ఏకేసిన నెటిజన్లు ఇప్పుడు విజయ్ ని ఎలా టార్గెట్ చేస్తారో అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: