కుర్ర హీరోలకు మైనర్ అమ్మాయిలను సప్లై చేస్తోన్న టాలీవుడ్ నటి?
సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల ప్రపంచం. సినిమా ఇండస్ట్రీలో తెర మీద కనిపించే ఈ రంగులు పైకి మాత్రమే. వాస్తవంగా చూస్తే మాత్రం లోపల మాత్రం అన్ని పురుగులే ఉంటాయి. సినిమా రంగంలో వెండితెర మీద ఓ వెలుగు వెలిగి పోవాలని ఎంతోమంది అమ్మాయిలు ఫిల్మ్ నగర్లోకి అడుగు పెడుతూనే ఉంటారు. వీరిలో కొందరికే సినిమా ఛాన్సులు తలుపు తడతాయి. చాలామంది అమ్మాయిలు బ్రోకర్ల మాయమాటలకు పడిపోయి తమ జీవితాలను సర్వనాశనం చేసుకుంటూ ఉంటారు. ఇలా మోసపోతున్న అమ్మాయిల్లో చాలామంది తమ శరీరాన్ని ఇతరులకు అర్పిస్తున్నారు.
ఈ క్రమంలోనే సినిమా అవకాశాలు ఇప్పిస్తానని ఓ సీనియర్ టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మైనర్ అమ్మాయిలతో వ్యభిచార రాకెట్ నడుపుతోందట. ఈ నాటకానికి ఆ సీనియర్ నటీమణి కర్త, కర్మ, క్రియగా ఉంటున్నారట. గోదావరి జిల్లాల నుంచి ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో సినిమాల్లో నటించిన ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బాగానే సెటిల్ అయ్యింది. టాలీవుడ్ లో ఓ సీనియర్ కమెడియన్ పక్కన ఆమె చేసిన కామెడీ సీన్లు బాగా పేలతాయి.
ఇటీవల ఆమెకు అవకాశాలు లేకపోవడంతో తన చుట్టుపక్కల ఊళ్ల నుంచి అమ్మాయిలను సినిమా అవకాశాలు ఇప్పిస్తానంటూ హైదరాబాదుకు పిలిపిస్తోందట. వీరిని మాయ మాటలతో వ్యభిచార రొంపిలోకి దింపుతోందట. అవకాశాల కోసం ఇలాంటివి ముందు తప్పవని చెపుతోందట. ఈ క్రమంలోనే వారిని ఇండస్ట్రీలో తనకు తెలిసిన కుర్ర హీరోలు... క్యారెక్టర్ ఆర్టిస్టులు దగ్గరకు పంపుతోందట. ఇలా ఆమె బాగా డబ్బులు సంపాదిస్తోంది. ఆమె దగ్గర 20 ఏళ్ల లోపు ఉన్న గోదావరి జిల్లాల మైనర్ బాలికలు 10 మంది వరకు ఉన్నారట.
ఈ మైనర్ బాలికలను కుర్ర హీరోల పక్కన పడుకోబెట్టి కూడా వాళ్లకు బాగా దగ్గరవుతోందట. ఇలా ఆమె ట్రాప్‌లో పడ్డ ఓ బాలిక తండ్రికి ఈ విషయం తెలియడంతో అతడు ఆమె ఇంటికి వెళ్లి నానా రచ్చ రచ్చ చేయడంతో ఆమె అతడితో సెటిల్ చేసుకుందట. ఈ విషయం బయటకు వస్తే తన పరువు పోతుందని అతడిని ఎలాగోలా మేనేజ్ చేసి పంపించింసేసిందట. ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో బాగా హాట్ టాపిక్‌గా మారింది.