సెన్సార్ చిక్కుల్లో కార్తికేయ ‘90 ఎంఎల్’?
ఈ మద్య టాలీవుడ్ లో యంగ్ హీరోలు తమ సత్తా చాటుతున్నారు. కంటెంట్ సాలీడ్ గా ఉంటే ఎలాంటి మూవీస్ అయినా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారన్న విషయం తెలిసిందే. రాంగోపాల్ వర్మ ప్రియుశిష్యుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ‘ ఆర్ఎక్స్ 100’ మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు యువ హీరో కార్తికేయ. ఈ సినిమా మొదట బోల్డ్ కంటెంట్ అంటూ విమర్శలు వచ్చినా.. ఎమెషనల్ లవ్ స్టోరీ నచ్చడంతో యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. దాంతో ఈ మూవీ పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభాలు తెచ్చిపెట్టాయి. ఫస్ట్ మూవీ మంచి సక్సెస్ కావడంతో కార్తికేయ కు వరుసగా ఛాన్సులు వచ్చాయి. తర్వాత ' ఆర్ఎక్స్ 100' సినిమా తర్వాత 'హిప్పీ' అనే సినిమాతో వచ్చిన కార్తికేయ ఆ సినిమాతో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.
ఆ తర్వాత 'గుణ 369' అంటూ వచ్చి పరవాలేదనిపించాడు. హీరోగానే కాదు ఆ మద్య విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ మూవీలో విలన్ గా నటించి మెప్పించాడు. ప్రస్తుతం నూతన దర్శకుడు శేఖర్ రెడ్డి దర్శకత్వంలో 90 ఎంఎల్ అనే మూవీలో చేస్తున్నాడు. ఈ మూవీ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ అయ్యాయి. 90 ఎంఎల్ అనే పదం ఎవరికి తెలిసినా..తెలియకపోయినా మందు బాబులకు మాత్రం బాగా తెలుసు. మందు బాబులకు '90ml' అంటే ఎంటో ఊరికే చెప్పేస్తారు.. అదో కొలమానం. మాస్లో చాలా పాపులర్ ఆ పదం.
ఇంత ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ఇప్పుడు కార్తికేయ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమైయాడు. ఇక సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న 90 ఎల్ మూవీకి సెన్సార్ సమస్యలు తలెత్తుతున్నాయట. చిత్ర కథ, కథనం సరిగ్గా లేదని భావించిన సెన్సార్ బోర్డ్ సభ్యులు 90 ఎంఎల్ మూవీకి సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారట. రేపు సినిమా రిలీజ్‌కి సిద్ధమవుతున్న క్రమంలో ఇలాంటి సమస్యలు రావడం నిర్మాతలకి ఆందోళన కలిగిస్తుంది. దాంతో ఇప్పుడు సెన్సార్ బోర్డ్ చెప్పినట్టు పలు మార్పులు చేసేందుకు మేకర్స్ సిద్ధంగా ఉన్నారట. మరి ఎలాంటి మార్పులు చేర్పులు చేస్తారో చూడాలి. నేహా సోలంకి కథానాయికగా నటిస్తున్న ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.