నాని నటించిన 'గ్యాంగ్ లీడర్'తో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది చెన్నై బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్. సినిమా ఫలితం పక్కన బెడితే తన క్యూట్ లుక్స్ తో యూత్ ను ఫిదా చేసింది ప్రియాంక. ఇక ఈ చిత్రం తరువాత ఆమె తెలుగులో బిజీ అవ్వడం ఖాయమనుకున్నారంతా కానీ ఇంతవరకు తెలుగులో మరో ఛాన్స్ దక్కించుకోలేకపోయింది.
ఇక ఇప్పుడు ప్రియాంక కు ఓ భారీ ఆఫర్ వచ్చింది అది అయితే అది తెలుగులో కాదు కోలీవుడ్ లో.. తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్, కోలమావు కోకిల ఫేమ్ నెల్సన్ కాంబినేషన్ లో డాక్టర్ అనే చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించనుంది. రేపటి నుండి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. కోలీవుడ్ లో ప్రియాంక కు ఇదే మొదటి సినిమా. మరి ఈ చిత్రంతో ప్రియాంక అక్కడ బిజీ అవుతుందేమో చూడాలి. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందించనున్న ఈ చిత్రంలో యోగిబాబు , డిటెక్టివ్ ఫేమ్ వినయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కేవలం ఈసినిమా షూటింగ్ ను 50 రోజుల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి. శివ కార్తికేయన్ ప్రొడక్షన్స్ , కెజెఆర్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుముందుకు రానుంది.
ఇక ఈ చిత్రం కన్నా ముందు శివ కార్తికేయన్ , హీరో తో ప్రేక్షకులముందుకు రానున్నాడు. అభిమన్యుడు ఫేమ్ పీఎస్ మిత్రన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈచిత్రంతో హలో బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. డిసెంబర్ 20 న ఈచిత్రం విడుదలకానుంది.