తెరి నుండి వరుస సక్సెస్ లతో దూసుకుపోతూ సినిమా సినిమా కు తన రేంజ్ ను పెంచుకుంటూ పోతున్నాడు తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్. తెరి తరువాత మెర్సల్,సర్కార్ తో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్న విజయ్ ఇటీవల బిగిల్ తో అదిరిపోయే హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు.
అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల విడుదలై ప్రపంచ వ్యాప్తంగా 250కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రం తరువాత విజయ్ ప్రస్తుతం ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో తన 64వ చిత్రంలో నటిస్తున్నాడు. ఈచిత్రం ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ లో కర్ణాటక లోని శివమొగ్గ జైలు పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది.
ఇక ఈ చిత్రం డిజిటల్ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు ను నెలకొల్పింది. కోలీవుడ్ చరిత్రలోనే లోనే అత్యంత భారీ మొత్తానికి ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. అయితే ఈ డీల్ విలువ ఎంతో తెలియాల్సి వుంది. కాగా ఈచిత్రం యొక్క శాటిలైట్ హక్కులను సన్ టీవి సొంతం చేసుకోగా ఆడియో రైట్స్ ను సోనీ మ్యూజిక్ దక్కించుకుంది. ఈమొత్తం డీల్ విలువ 52కోట్లు ఉంటుందని సమాచారం. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తుండగా పేట ఫేమ్ మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది. కోలీవుడ్ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఎక్స్ బి ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదలకానుంది.