సైరా సినిమాలో పవన్ కళ్యాణ్ నటించాలి కానీ....?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా తెలుగులో సూపర్ హిట్ అనిపించుకోగా మిగతా భాషల్లో మాత్రం డిజాస్టర్ అయింది. ఈ సినిమా నిర్మాత రామ్ చరణ్ కు భారీగా నష్టాలు వచ్చాయని సమాచారం. సైరా సినిమా విడుదలకు ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైరా సినిమాలో ఒక సన్నివేశంలో నటించినట్లు వార్తలు వఛ్చాయి.
కానీ సినిమా విడుదలైన తరువాత పవన్ కళ్యాణ్ మాత్రం సినిమాలో ఎక్కడా కనిపించలేదు. సైరా సినిమా రచయిత పరుచూరి గోపాలకృష్ణ సైరా సినిమాలో పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్న సన్నివేశాన్ని చెప్పారు. సైరా సినిమా క్లైమాక్స్ లో చిరంజీవి చనిపోయిన తరువాత ఐదారుగురు నాయకులు అలా వచ్చేసి జాతీయ ఎండే ఎగరవేసే సన్నివేశంలో రెండు కాళ్లు నడుచుకుంటూ కొండపైకి వెళతాయని అక్కడ పవన్ కనిపించాలని పవన్ కు రెండు డైలాగులు కూడా ఉన్నాయని చెప్పారు.
కానీ చిరంజీవి ఆ సన్నివేశాన్ని సినిమాలో పెట్టటానికి ఒప్పుకోకపోవటం వలన ఆ సీన్ ను సినిమాలో పెట్టలేదని చెప్పారు. ఆ తరువాత ఆ సన్నివేశంలో నటించమని రామ్ చరణ్ ను కూడా అడిగానని కానీ రామ్ చరణ్ ఒప్పుకోలేదని చిరంజీవిని అడగమని చెప్పారని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. సైరా సినిమాలో పవన్ కళ్యాణ్ కనిపించకపోయినప్పటికీ పవన్ గొంతు వినిపించినందుకు సంతోషంగా ఉందని అన్నారు.
సైరా సినిమా చివరలో ఆ ఒక్క సన్నివేశం పెట్టి ఉంటే మాత్రం నూరుపాళ్లు సంతోషం వ్యక్తం చేసేవాడినని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. సైరా సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి తను రాసుకున్న కథను చాలా మార్చేశాడని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. పరుచూరి గోపాలకృష్ణ చిరంజీవి అనుమతి ఇస్తే మాత్రం తన ఒరిజినల్ స్క్రిప్ట్ ను పుస్తకంగా ముద్రించుకుంటానని అన్నారు.