పవన్ కళ్యాణ్ స్థానంలో ఎవరు వస్తారు...

frame పవన్ కళ్యాణ్ స్థానంలో ఎవరు వస్తారు...

Pranateja Sriram

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అటు ఇసుక విధానం మీద, ఇటు ఇంగ్లీషు మీడియంపై ఉద్యమం చేస్తున్నారు. అయితే వీటన్నింటిలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు చేస్తాడన్నది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో సినిమాలకి దూరంగా ఉంటానని ప్రకటించిన పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం సినిమా చేసేందుకు ముందుకు వచ్చాడు. హిందీలో బ్లాక్ బస్టర్ అయిన పింక్ సినిమా రీమేక్ లో నటించనున్నాడని ప్రకటించిన సంగతి తెలిసిందే.

 


అయితే ప్రస్తుతం ఈ సినిమా రీమేక్ గురించి విపరీతంగా చర్చ నడుస్తుంది. బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమా రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడనగానే ఆయన అభిమానుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేసే పరిస్థితి కనిపించడం లేదని సమాచారం. రాజకీయంగా బిజీగా ఉంటూ ప్రజలకి దగ్గరగా ఉండాలన్న నేపథ్యంలో సినిమా మీద ఆసక్తి చూపించట్లేదని సమాచారం.

 

దాంతో సినిమా ఆలస్యం కానుందట. అయితే ముందుగా ఈ సినిమా రీమేక్ కోసం దిల్ రాజు బాలక్రిష్ణ ని అనుకున్నారట. బాలక్రిష్ణ అయితే బాగుంటుందని భావించారట. కానీ పవన్ కళ్యాణ్ వచ్చేసరికి  పవర్‌స్టార్‌తో సినిమా తీసే కలని ఈ చిత్రంతో సాకారం చేసుకోవాలని చూసాడు. కానీ అది కుదిరేలా లేదు. దాంతో ఎవరితో చేయాలా అని తెగ ఆలోచిస్తున్నారట. ఈ విషయం గురించి దిల్ రాజు ఆఫీస్ లో చర్చ నడుస్తుందట.

 

ఇదిలా ఉంటే దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ సినిమాని తెలుగు వాళ్లకి చేరువ చేసేలా అన్ని మార్పులతో సిద్ధంగా ఉన్నాడట. మరి అన్నీ కుదిరి ఈ సినిమా ఎవరితో మొదలవుతుందో చూడాలి. దిల్ రాజు అనుకున్నట్టు బాలక్రిష్ణ తో చేసినా బాగానే ఉంటుంది.

Find Out More:

Related Articles:

Unable to Load More