నాగచైతన్య "మజిలీ" సెంటిమెంట్... "వెంకీ మామ" సినిమాపై వర్కవుట్ అవుతుందా.?
రియల్ లైఫ్ మామ అల్లుళ్ళు రిల్ ల్లైఫ్ లో కూడా మామ అల్లుళ్లుగా మారిపోయారు. వాళ్లే నాగచైతన్య వెంకటేష్. ప్రస్తుతం అక్కినేని వారసుడు నాగచైతన్య దగ్గుబాటి వారసుడు విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా వెంకీ మామ. ప్రస్తుతం ఈ సినిమాపై అటు అక్కినేని అభిమానులు ఇటు విక్టరీ వెంకటేష్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాపై అటు అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ నెల 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. సినిమా పాటలు కూడా అభిమానులను తెగ ఆకర్షిస్తున్నాయి.
కాగా ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ తో ఈ సినిమాలో వెంకటేష్ నాగచైతన్య కలిసి ఒక మంచి యాక్షన్ చేయబోతున్నారని ఇది మాత్రం క్లియర్ గా అర్థమైంది. మామ అల్లుళ్ళ కాంబినేషన్ సినిమా ట్రైలర్ లోనే అదరగొడితే ఇక ఫుల్ లెన్త్ సినిమా లో ఎలా ఉండబోతుంది అని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ సినిమాలో వెంకటేష్ సరసన టాలీవుడ్ హాట్ బ్యూటీ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పాయల్ రాజ్ పుత్ నటించగా... నాగచైతన్య సరసన అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నా నటించినది . ఇదిలా ఉంటే అక్కినేని వారసుడిగా నాగ చైతన్య రియల్ లైఫ్ రిలేషన్షిప్ ను రియల్ లైఫ్ లో కూడా కంటిన్యూ చేస్తున్నది.
నాగచైతన్య హీరోగా ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన మజిలీ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో తన రియల్ లైఫ్ లో జోడి రీల్ లైఫ్ లో కూడా నటించారు. మరోసారి నాగచైతన్య ఇదే సెంటిమెంట్ తో ఉన్నట్లు తెలుస్తోంది. నాగచైతన్య వెంకటేష్ రియల్ లైఫ్లో కూడా మామ అల్లుళ్ళ. అటు వెంకీ మామ సినిమాలో కూడా ఇద్దరు సేమ్ రిలేషన్షిప్ ఉన్న రోల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో మజిలీ సినిమా విజయం సాధించినట్లుగానే వెంకీ మామ సినిమా కూడా విజయం సాధిస్తుందని నాగచైతన్య గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇక ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో చూడాలి మరి.