స్టేజిపై బోరున ఏడ్చేసిన రాఘవేంద్ర రావు..!

KSK

డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ మరియు నాగ చైతన్య కలిసి నటించిన సినిమా వెంకీ మామ. టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ మల్టీ స్టారర్ సినిమా రాబోయే శుక్రవారం విడుదల కానుంది. దీంతో సినిమాకి సంబంధించి ప్రచార కార్యక్రమాల విషయంలో సినిమా యూనిట్ జోరుగా పాల్గొంటూ సినిమాపై ప్రేక్షకులలో సినిమాపై హైప్ తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో తాజాగా సినిమా యూనిట్ వెంకీ మామ మ్యూజికల్ నైట్ అనే పేరుతో ఈవెంట్ నిర్వహించడం జరిగింది. జరిగిన ఈవెంట్ కి రాఘవేంద్ర రావు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.

 

ఈ క్రమంలో సినిమా గురించి మాట్లాడటానికి వేదికపై ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కసారిగా బోరున రాఘవేంద్రరావు కంటతడి పెట్టుకున్నారు. విషయంలోకి వెళితే సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దివంగత రామానాయుడు గారి ని గుర్తు చేసుకుని రాఘవేంద్ర రావు మాట్లాడుతూ విక్టరీ వెంకటేష్ మరియు నాగచైతన్యతో కలిసి సినిమా చేయాలని ఆయన బతికి ఉన్న సమయంలో ఎన్నోసార్లు తనతో అన్నారని రాఘవేంద్రరావు ఈ సందర్భంగా తెలిపారు. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన వెంకీ మామ సినిమా రామానాయుడు గారు ఎంతో ఇష్టపడి నా కాంబినేషన్ సినిమా అని కానీ సినిమా మొత్తం విడుదల అవుతున్న సందర్భంలో ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరమని…  అన్నమయ్య చిత్రం షూటింగ్ ప్రారంభమైనప్పుడు మా నాన్నగారు ఉన్నారు.

 

కానీ విడుదలయ్యే సమయానికి ఆయన లేరు. అన్నమయ్య చిత్రం రిలీజ్ రోజున.. మా నాన్న ఫోటో దగ్గరకు వెళ్లి ఏడ్చా.. ఈ ఒక్క సినిమా మీరు చూసి ఉంటే బావుండేదని కోరుకున్నా అని అన్నారు. ఈ క్రమంలో రాఘవేంద్ర రావు తన తండ్రి సూర్య ప్రకాష్ రావు గారిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. కంటతడి కూడా పెట్టుకున్నారు. అదే వేదికపై రానా ఉండటంతో రాఘవేంద్రరావు ని ఓదార్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వేదిక ముందు కూర్చుని ఉన్నా వెంకటేష్ సురేష్ బాబు కూడా తీవ్ర భావోద్వేగానికి గురి కావడం జరిగింది. రామానాయుడు వల్లే తాను ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఉన్నట్లు రాఘవేంద్ర రావు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: