టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు అక్క దొరికింది అనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం టాప్ యంగ్ హీరోలకు, హీరోయిన్స్ తో పాటు అక్కలు, అత్తలు దొరకడం కూడా పెద్ద సమస్యగా మారుతోంది. దీనికి కారణం ప్రస్తుతం అగ్ర హీరోలకు అక్కగానూ, అత్తగానూ చేయడానికి వయస్సు పైబడినవారిని తీసుకోవడంలేదు అదంతా ఒకనాటి కధ.
ప్రస్తుతపు ట్రెండ్ లో కాస్త వయస్సులో కొంచెం తేడా ఉన్న వారినే అక్కలుగా, అత్తలుగా తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది'చిత్రంలో పవన్‌కు అత్తగా ఒకప్పటి హీరోయిన్ నదియా నటించి ఎంతో మెప్పించిది. కొద్దికాలం నటిగా విరామం తీసుకున్నాక ఆమె చేసిన చిత్రమది. ఇప్పుడు ఆమెను అక్కగా, అత్తగా ఊహించుకుని రచయితలు కథలు రాసుకుంటున్నారు, ఇదంతా సెంటిమెంట్ కోసమే అనుకోవాలి. ఒక్క సినిమా హిట్ అయితే ఆమె డేట్స్‌కోసం దర్శకనిర్మాతలు ఎదురుచూస్తున్నారు
లేటెస్ట్‌గా మహేష్ బాబు సినిమాలో నదియాను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. కథలో మహేష్ బాబుతో ధీటుగా ఉండే పాత్రను ఆమె చేత చేయించాలని దర్శకుడు శ్రీనువైట్ల నిర్ణయించినట్లు తెలుస్తోంది. పవన్ కు అత్తగా నటించి బ్లాక్ బస్టర్ ఇచ్చిన నదియా అదే అద్భుతాన్ని మహేష్ బాబుతో కూడా రిపీట్ చేస్తుందేమో చూడాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: