నితిన్‌కి పెళ్ళి కుదిరిందట అమ్మాయి ఎవరో తెలిస్తే షాకే?
2020 ఏప్రిల్ లో నితిన్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుస్తోంది. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకడిగా ఉన్న నితిన్ ఓ ఇంటివాడు కాబోతున్నాడనే వార్త బయటికి రాగానే ఆయన అభిమానులు తెగ సంతోషపడుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ పెళ్లి వార్తపై నితిన్ ఏమంటాడో చూడాలి.ఈ ఏడాది నితిన్ సినిమా ఒక్కటి కూడా విడుదల కాలేదు. ఈ గ్యాప్‌లో కథలు విన్న నితిన్ ఒకేసారి నాలుగు చిత్రాలు ప్రకటించాడు. ఆయన ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భీష్మలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించి ఇటీవలే ఓ రొమాంటిక్ టీజర్ విడుదలై విశేషంగా ఆకట్టుకుంది. నితిన్ మరో సినిమా రంగ్ దే . ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్గా చేస్తోంది. నితిన్ మూడవ సినిమాను చంద్ర శేఖర్ ఏలేటితో చేస్తున్నాడు. నాలుగవది కృష్ణ చైతన్య అనే దర్శకుడితో చేస్తున్నాడు.