విక్టరీ వెంకటేష్ గురించి ఎవరికీ తెలియని కొన్ని నిజాలు.?
ఆయన ఏ సినిమా తీసిన అదీ సృష్టిస్తోంది హిస్టరీ... అందుకే ఆయన పేరు లోకి వచ్చేసింది విక్టరీ... ఆయనే కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్... ఫ్యామిలీ కథ సెంటిమెంట్ పండించడంలో సాటిలేని హీరో... ఆయనే టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్. ఎన్నో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు విక్టరీ వెంకటేష్. అసలు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాకు వెంకటేష్ తప్ప ఇంకెవరు సెట్ సెట్ కారేమో అనేంతలా ప్రేక్షకులను ప్రభావితం చేసారు. ఇక తన కామెడీ టైమింగ్ తో యాక్షన్తో ఆందరిని మెస్మరైజ్ చేశారు. అందుకే ఇండస్ట్రీకి వచ్చి మూడు పదుల సంవత్సరాలు దాటిపోయినా ఇప్పటికీ వెంకటేష్ క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు.
ఇప్పటికీ యువ హీరోలకు సైతం పోటీని ఇస్తూనే ఉన్నాడు విక్టరీ వెంకటేష్. కాగా నేడు డిసెంబర్ 13న విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా వెంకటేష్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 1986 ఆగస్టు 14న విడుదలైన కలియుగ పాండవులు సినిమా తో దగ్గుబాటి వారసుడు వెంకటేష్ తెలుగు సినిమా హీరోగా అరంగేట్రం చేశారు. కాగా తన మొదటి సినిమానే భారీ విజయాన్ని అందుకోవడంతో ఒక్కసారిగా వెంకటేష్ వెంకటేష్ స్టార్ డమ్ కూడా పెరిగిపోయింది. ఇక మొదటి సినిమాలోనే వెంకటేశ్ నటనకు ఉత్తమ నూతన నటుడు గా నంది అవార్డు సైతం సొంతం చేసుకున్నారు వెంకటేష్.కాగా వెంకటేష్ మొదటి సినిమాని దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలు వెంకటేష్ కి జోడీగా ఖుష్బూ నటించింది. ఈ సినిమాతో వెంకటేష్ స్టార్ హీరోగా ఎదిగితే ఖుష్బు కి ఏకంగా గుడి కట్టించేందుకు సిద్ధమయ్యారు అభిమానులు.
కాగా 1971లో ఏఎన్ఆర్ హీరోగా విడుదలైన ప్రేమ్ నగర్ లో బాలనటుడిగా కనిపించారు వెంకటేష్. ఇక ఆ తర్వాత వరుస విజయాలను సొంతం చేసుకుంటూ తన ఇంటి పేరునే విక్టరీ మార్చుకున్నారు వెంకటేష్. అప్పటికీ హీరో వెంకటేష్ కి స్టార్డం రాకపోయినప్పటికీ 1987 మే 29న వెంకటేష్ నటించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదలయ్యాయి. ఇక బొబ్బిలి పులి సినిమా తో ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోయాడు విక్టరీ వెంకటేష్. బాలీవుడ్ లో కూడా తన లక్కును పరీక్షించుకున్నారు. కాగా మొత్తంగా ఐదు నంది అవార్డులను సొంతం చేసుకున్నారు విక్టరీ వెంకటేష్. ప్రస్తుతం మల్టీస్టారర్ లకు మారుపేరుగా మారిపోయారు.
ఈ సంవత్సరం ప్రారంభంలో మెగా హీరో వరుణ్ తేజ్ తో ఎఫ్2 సినిమాలో కలిసి నటించి బ్లాక్బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు విక్టరీ వెంకటేష్. ఇక తాజాగా నాగచైతన్యతో వెంకీ మామ సినిమాలో నటిస్తుండగా ఆ సినిమా నేడు విక్టరీ వెంకటేష్ బర్త్ డే సందర్భంగా విడుదల కాబోతుంది. కాగా సినీ ఇండస్ట్రీలో 33 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు వెంకటేష్. అంతేకాకుండా ప్రస్తుతం తమిళ హిట్ మూవీ అసురన్ లో నటించనున్నట్టు ప్రకటించారు. అంతేకాదండోయ్ తన సినీ కెరీర్లో ఎక్కువగా రీమేక్ సినిమాలు తీసిన నటుడిగా కూడా వెంకటేష్ కు రికార్డు కూడా ఉంది.