యాంకర్ సుధీర్, రష్మీ గౌతమ్ అంటే చాలు ఢీ జూనియర్స్ లో పార్టనర్స్ మరియు జబర్దస్త్ లోయాంకర్ గా కమెడియన్ గా కలిసి బుల్లితెరపై నటిస్తూ ఎంత ప్రత్యేకమైన గుర్తింపు తెచుకున్నారో అందరికి తెలుసు అలాగే వారి మధ్య ఉన్న సంబంధం కొందరు ప్రేమ అని కొందరు కాదు అని ఎటు చెప్పలేని పరిస్థితి.
ఇంకా చెప్పాలంటే సుధీర్ గుర్తుకు రాగనే రష్మి అలాగే రష్మి గుర్తుకు రాగనే సుధీర్ గుర్తుకు రావాల్సిందే. అంతలా వీరి జంట ఫేమస్ అయ్యింది. వీరిద్దరి చూసిన ప్రతి వాళ్లకు వారి ఇద్దరి మధ్య ఏదో ఉందనిపిస్తుంది అని అనిపించక మానదు.ఇలా ప్రతి వారు ఇలా అపార్థం చేసుకుంటున్నారన్న ఆలోచనతో ఇటీవల ఓ కార్యక్రమం లో వివరంగా వారిద్దరిమద్య ఉన్న సంబంధం గురించి క్లారిటీ ఇచ్చాడు. తమది కేవలం టీవీ లోని కార్యక్రమాలకోసం జరిపే కెమిస్ట్రీ మాత్రమేనని, తమ మధ్య ఎలాంటి ఎఫైర్, లవ్ స్టోరీలు లేవన్నాడు.
అయితే రీసెంట్గా రష్మీ గురించి కొన్ని విషయాలు తెలిసాయి వాటితో ఆమె పైన నాకు చాలా గౌరవం పెరిగిందన్నాడు. ఆ విషయం తనకు కూడా చెప్పాను అని ఈ మధ్య ఆమె గురించి తెలుసుకున్న తర్వాత ఆమె అంటే ఇష్టం కంటే రష్మీ అంటే గౌరవం పెరిగింది అని చెప్పారు. ఆమె ఎప్పటికీ నా గుండెల్లో ఉంటుందన్నాడు కానీ ప్రియురాలిగా కాదు అని ఈ విధంగా రష్మిక గురించి తన మనసులో మాటలను బయటపెట్టాడు. అయితే ఇదంతా విన్న వీరిద్దరి ఫాన్స్ కంగారు పడుతున్నారట వీరిద్దరూ కలిసి జీవితం గడపాలని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నారట అయితే ఈ విదంగా స్పందించిన సుధీర్ కు పెళ్ళిచేసుకునె ఉద్యేశం లేదు అని అర్ధం అవుతుంది చూడాలి ఏమవుతుంది అని.