‘వరల్డ్ ఫేమస్ లవర్' విజయ్ దేవరకొండతో సింగరేణి ప్రేమికురాలా?
పాత్ర పరంగా సింగరేణి ప్రాంతంతో తనకున్న రిలేషన్ గురించి “బొగ్గు గనిలో నా బంగారం, నా వరల్డ్ ఫేమస్ లవర్. ఈ వేలంటెన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న శ్రీనును కలుసుకుందాం” అంటూ క్యాథరిన్ మెసేజ్‌ను పోస్ట్ చేసింది. ఖాకీ చొక్కా, ప్యాంటు వేసుకుని సింగరేణి కార్మికుడిగా విజయ్ దేవరకొండ కనపడుతున్నారు. ఆయన గర్ల్‌ఫ్రెండ్ స్మిత పాత్రలో క్యాథరిన్ కనపడుతున్నారు. ఇప్పటి వరకు విడుదలైన విజయ్ దేవరకొండ రెండు లుక్స్‌కు ఈ లుక్ డిఫరెంట్‌గా ఉంది. జనవరి 3న ఈ సినిమా టీజర్ విడుదలవుతుంది. ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు సమర్పణలో కియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని కె.ఎ.వల్లభ నిర్మిస్తున్నారు. గోపీసుందర్ మ్యూజిక్, జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇలా నాలుగురోజుల పాటు నలుగురి లవర్స్ లుక్స్‌ని వారి క్యారెక్టర్స్‌ని రివీల్ చేయనున్నాడు ‘వరల్డ్ ఫేమస్ లవర్’ విజయ్ దేవరకొండ. ఇప్పటికే ఐశ్వర్యా రాజేష్.. సువర్ణ పాత్రలో డీ గ్లామరస్‌గా కనిపించి సర్ ప్రైజ్ చేయగా.. ఇజాగా ఇజాబెల్లా కనిపించింది. ఇక ఈరోజు విడుదలైన మూడో లవర్ లుక్‌లో కేథరిన్ స్మిత మేడమ్‌గా సర్ ప్రైజ్ చేసింది. బొగ్గుగనిలో పనిచేసే యూనియన్ లీడర్ శీను ప్రేమలో స్మిత మేడమ్ ఎలా పడిందన్న కోణంలో వీరి మధ్య లవ్ ట్రాక్ ఉండనుంది.