అజిత్ సినిమాలో విలన్ గా మారబోతున్న టాలీవుడ్ హీరో.?

praveen

ప్రస్తుతం చాలా మంది హీరోలు ఈ రోజుల్లో హీరోలుగా నటించటమే  కాదు మరోవైపు ఛాన్స్ వస్తే కూడా విలన్లు గా  మారిపోతున్నారు. ఓ వైపు హీరోలుగా మరోవైపు విలన్ లుగా తమ  సత్తా చాటుతూ దూసుకుపోతున్నారు చాలామంది నటులు. ఈ క్రమంలోనే విలన్ గా మంచి పేరు తెచ్చుకున్న నటుడు రానా. హీరోగానే కాదు విలన్ పాత్రలో తన విశ్వరూపాన్ని కూడా చూపించాడు. ఇక తాజాగా ఆర్ఎక్స్ 100 సినిమా తో తెలుగు ప్రేక్షకులందరికీ దగ్గరైనా హీరో కార్తికేయ... ఓ వైపు వరుస సినిమాలు చేసుకుంటూ హీరోగా  దూసుకుపోవడమే  కాదు... మరోవైపు సినిమాల్లో విలన్ పాత్రలో కూడా ఇరగదీసేస్తున్నారు. తాజాగా గ్యాంగ్ లీడర్ తో విలన్ పాత్రల్లో నటించి... తన నటనతో విలన్  పాత్రల్లో కూడా మెప్పించగలను  నిరూపించాడు హీరో కార్తికేయ. 

 

 

 

 ఇంకేముంది గ్యాంగ్ లీడర్ సినిమాలో తన నటనను చూసి విలన్ పాత్ర చేయాలంటే చాలా మంది దర్శకులు కార్తికేయ సంప్రదిస్తున్నారు. ఈ క్రమంలోనే కార్తికేయ మరో స్టార్ హీరో సినిమా లో విలన్ పాత్రలో నటించబోతున్నారని సమాచారం. తాజాగా హీరో కార్తికేయ తమిళ స్టార్ హీరో అజిత్ సినిమాలో విలన్ గా మారబోతున్నాడట . అజిత్  సినిమాలో విలన్ గా నటించేందుకు కార్తికేయ ఓకే చెప్పినట్లు కోలీవుడ్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం అజిత్ హెచ్ వినోద్ దర్శకత్వంలో వాలిమై  సినిమా చేస్తున్నాడు. కాగా ఈ సినిమాలో  కార్తికేయ విలన్గా నటించబోతున్నట్లు సమాచారం. 

 

 

 అజిత్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్ పాత్రకు మంచి స్కోప్ ఉందట. అందులో యంగ్  హీరో అయితేనే  విలన్ పాత్రలో సూట్ అవుతారు అని భావించిన దర్శక నిర్మాతలు... కార్తికేయను  సంప్రదించినట్లు తెలుస్తోంది. కార్తికేయ కూడా అజిత్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో విలన్ పాత్ర అనగానే ఓకే చెప్పినట్లు సమాచారం. కాగా దీనిపై మాత్రం ఇంత వరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇప్పటికే గ్యాంగ్ లీడర్ సినిమా లో విలన్ పాత్రను సునాయాసంగా చేసి తన నటనతో అందరిని మెప్పించిన కార్తికేయ ఒకవేళ అజిత్ సినిమాలో విలన్గా నటిస్తే మరిన్ని సినిమా ఛాన్సులు సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: