వెంకీ మామకు టెన్షన్ - మిగిలి ఉన్న ఆమూడు రోజులు !

Seetha Sailaja

అత్యంత భారీ అంచనాలతో గత వారం విడుదలైన ‘వెంకీ మామ’ కు డివైడ్ టాక్ వచ్చినా ఆ మూవీ మొదటి నాలుగు రోజులలో 45 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వసూలు చేయడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి ఈ సినిమాకు రివ్యూలు వ్రాసిన వారు కూడ యావరేజ్ రేటింగ్స్ ఇవ్వడంతో ఈ మూవీకి ఇంత భారీ కలక్షన్స్ ఎలా వచ్చాయి అన్న విషయమై ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్య పోతున్నాయి.

ఒక రొటీన్ కథతో కేవలం వెంకటేష్ నాగ చైతన్యల కాంబినేషన్ క్రేజ్ ను నమ్ముకుని ఈ మూవీని నిర్మించారు. ఈ మూవీకి 45 కోట్లకు పైగా భారీ బడ్జెట్ అవ్వడంతో ఈ మూవీ బయ్యర్లు కొంతమంది వెనక్కు తగ్గినా నిర్మాత సురేశ్ బాబు స్వయంగా రిలీజ్ చేసాడు. 

దీనికితోడు ఈమూవీకి భారీ ప్రమోషన్ చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి ఓపెనింగ్ కలక్షన్స్ బాగా వచ్చి 45 కోట్ల గ్రాస్ మార్క్ వరకు చేరుకున్నాయి. అయితే నిన్న మొదటి సోమవారం పరీక్షలో ఈ మూవీకి ఎవరేజ్ కలక్షన్స్ మాత్రమే వచ్చాయి. దీనితో ఈ మూవీకి గట్టెక్కడానికి కావలసిన 85 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వచ్చే పరిస్థితి ఉందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

దీనికితోడు మరో మూడు రోజులలో డిసెంబర్ 20న సల్మాన్ ఖాన్ ‘దబాంగ్ 3’ సాయి తేజ్ ‘ప్రతిరోజు పండగే’ కార్తి ‘దొంగ’ బాలకృష్ణ ‘రూలర్’ విడుదల కాబోతున్నాయి. ఇన్ని భారీ సినిమాల మధ్య ‘వెంకీ మామ’ కలక్షన్స్ పరంగా తట్టుకుని నిలబడలేకపోతే ఈమూవీకి నష్టాలు తప్పవు అన్న ప్రచారం జరుగుతోంది. దీనితో ఈ క్రిస్మస్ సినిమాల విడుదలకు ముందే ‘వెంకీ మామ’ కుదుట పడాలి. అయితే మిగిలి ఉన్న కేవలం మూడు రోజులలో ఈ మూవీకి సంబంధించి అద్భుతాలు ఎంత వరకు జరుగుతాయి అంటూ చాల మంది పెదవి విరుస్తున్నారు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: