కరెక్టే : బాహుబలి కండల్ మండేలా ఐనా-మిర్చి లవర్ బాయ్ ఐనా మన డార్లింగే..!

shami

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి ముందు వరకు కేవలం ఒక తెలుగు స్టార్ హీరో ఇమేజ్ మాత్రమే ఉండగా బాహుబలి తర్వాత నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆరుడగులు ఆజానుబావుడైన ప్రభాస్ కటౌట్ కు తగినట్టుగానే క్రేజ్ తెచ్చుకున్నాడు. మాస్ ఆడియెన్స్ కు మస్త్ జబర్దస్త్ ఎంజాయ్ చేసే సినిమాలు చేసే ప్రభాస్ కేవలం వారికోసమే కాకుండా లవర్ బోయ్ గా కూడా అలరిస్తున్నాడు.

 

తన మాస్ కటౌట్ కేవలం మాస్ ఆడియెన్స్ కోసమే అన్నట్టు కాకుండా లవ్ స్టోరీస్ చేస్తూ అలరిస్తున్నాడు ప్రభాస్. బాహుబలి లాంటి సినిమా చేసే ప్రభాస్ ఇంతకుముందు డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి లాంటి సినిమాలు చేస్తాడని ఎవరు ఊహించి ఉండరు. కంటెంట్ ఎలాంటిదైనా సరే ప్రభాస్ ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ అందుకుంటున్నాడు.

 

బాహుబలిలో వీరుడిగా కనిపించిన ప్రభాస్ రాజు మిర్చి సినిమాలో లవ బోయ్ గా తన ప్రేమని గెలిపించుకునే సాధారణ వ్యక్తిగా కనిపిస్తాడు. కత్తి వాడటం మొదలు పెడితే నాకన్నా ఎవడు బాగా వాడలేడు అంటూ ప్రత్యర్ధులకు వార్నింగ్ ఇచ్చినా సరే అది ప్రభాస్ ఒక్కడికే చెల్లింది. పెదనాన్న వారసత్వాన్ని పునికి పుచ్చుకుని యంగ్ రెబల్ స్టార్ గా ప్రభాస్ సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించడమే కాదు ప్రేమించిన అమ్మాయి హృదయాన్ని గెలిచేస్తాడు ప్రభాస్. 

 

బాహుబలి తర్వాత సాహో మూవీ చేసిన ప్రభాస్ ప్రస్తుతం జాన్ అంటూ మరో క్రేజీ లవ్ స్టోరీతో వస్తున్నాడు. ఈ సినిమాను జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. సినిమాలో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో మరోసారి ప్రభాస్ తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ఇదివరకు ఎప్పుడూ చూడని క్రేజీ లవ్ స్టోరీతో ఈ సినిమా వస్తుందని అంటున్నారు చిత్రయూనిట్.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: