మినిమమ్ గ్యారంటీగా సుప్రీం హీరో సినిమా.. కారణం ఇదే.?

praveen

టాలీవుడ్ కి మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు ఎంట్రీ  ఇచ్చారు. అందులో ఒకరైన సాయి ధరంతేజ్... తనదైన కామెడీ టైమింగ్ యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకుల అందరినీ అలరించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఏకంగా సుప్రీం హీరో గా తెలుగు అభిమానుల గుండెల్లో ముద్రవేసుకున్నాడు సాయి ధరమ్ తేజ్. మొదటి వరుస విజయాలతో సాయి ధరంతేజ్ దూసుకుపోయినప్పటికీ... ఆ తర్వాత వరుస సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. విభిన్నమైన కథాంశంతో వచ్చినప్పటికీ ప్రేక్షకుల ఆదరణ మాత్రం పొందలేకపోయాయి.  దీంతో సాయి ధరంతేజ్ కెరీర్ ముగిసిపోయింది అని టాలీవుడ్లో చాలా మంది ప్రేక్షకులు అనుకున్నారు. కానీ చిత్రలహరి సినిమా తో మరోసారి రేస్  లోకి వచ్చాడు సాయి ధరమ్ తేజ్. 

 

 

 

చిత్రలహరి సినిమాలు ఎన్నో ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ సాధించిన యువకుడిగా సాయి ధరంతేజ్ అలరించాడు. ఇక ఇప్పుడు ప్రతి రోజు పండగే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన  ఈ సినిమాలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ సరసన అందాల ముద్దుగుమ్మ రాశిఖన్నా నటిస్తోంది. కాగా ఈ సినిమాకి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి డిసెంబర్ 20న అంటే రేపు విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ పాటలు కూడా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. సినిమాలో  రాసి కన్నా టిక్టాక్ ఎడిట్ అయిన యువతిగా నటిస్తోంది. 

 

 

 

 అయితే ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ హిట్ కొట్టే లాగానే కనిపిస్తున్నాడు. ఎందుకంటే ప్రస్తుతం సినీ ప్రేక్షకులు అందరూ కామెడీ ఎంటర్టైనర్ సినిమాలను  తెగ ఆదరిస్తున్నారు. దీంతో ఈ మధ్య వచ్చిన కామెడీ ఎంటర్టైనర్ సినిమాలు మంచి విజయాలను అందుకుంటున్నాయి . ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సినిమా కామెడీ ఎంటర్టైనర్గా రూపొందినది.  ఈ సినిమాకు కూడా మినిమం గ్యారెంటీ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక అంతే కాకుండా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న సినిమాలు అంటే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉంటాయి. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో పాజిటివ్ ఒపీనియన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిత్రలహరి సినిమా తో విజయాన్ని సొంతం చేసుకుని దూకుడు మీదున్న సాయి ధరంతేజ్ ప్రతి రోజు పండగే చిత్రంలో ప్రేక్షకులను ఎంతగా ఎట్రాక్ట్ చేస్తాడో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: