బాలయ్యను సోనాల్ కాపాడాలి దేవుడా...!
వరుసగా ఫ్లాపులతో సతమతం అవుతున్న బాలకృష్ణ ఇప్పుడు తాజాగా నటిస్తున్న చిత్రం రూలర్. ఇకపోతే ఎన్టీఆర్ బయోపిక్‌గా తెరకెక్కిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు దారుణంగా ఫెయిల్ కావటంతో బాలయ్య అభిమానులు ఈ సినిమా మీదే ఆశలు పెట్టుకున్నారు. గతంలో బాలయ్య హీరోగా జైసింహా సినిమాకు దర్శకత్వం వహించిన కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సీ కళ్యాణ్ నిర్మిస్తుండగా, సోనాల్ చౌహాన్, వేదికలు హీరోయిన్లుగా నటిస్తుండగా జయసుథ, భూమిక, ప్రకాష్ రాజ్, శియాజీ షిండేలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు..
కాగా నందమూరి అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్న ఈ సినిమా ఆశించిన స్థాయిలో లేదని తెలుస్తోంది. ఏ మాత్రం కొత్తదనం లేకుండా సాగుతుందట. ముఖ్యంగా బాలకృష్ణ రొటీన్ సినిమాలా యాక్షన్, పంచ్ డైలాగ్‌లు, హీరోయిన్లతో రొమాన్స్ లాంటి అంశాలు అన్నీ గతంలో బాలయ్య సినిమాల్లో చాలా సార్లు చూసినట్టుగానే ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. దీంతో రూలర్ బాలయ్య ఫ్యాన్స్‌కు మాత్రమే అంటున్నారు విశ్లేషకులు. ఇదే కాకుండా బాలయ్య లుక్ విషయంలో కూడా విమర్శలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా పోలీస్ గెటప్‌లో బాలయ్య విగ్‌పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. మరో లుక్ కూడా ఐరన్ మ్యాన్‌లా ఉందంటున్నారు ఫ్యాన్స్. ఇలా అన్ని రకాలుగా నెగెటివ్ టాక్ వస్తుండటం ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది. ఇక చెప్పుకోతగ్గ కధ, కధనం లేని ఈ సినిమాను సోనాల్ చౌహాన్ అందాలతో అయినా గట్టెక్కిస్తుందేమో అని ఆశపడుతున్నారట అభిమానులు..
ఇక ఇప్పటికే బాలయ్య సరసన లెజెండ్ సినిమాలో నటించిన సోనాల్ చౌహాన్.. పండగ చేస్కో, రెయిన్బో, డిక్టేటర్ సినిమాల్లో మెప్పించింది. అయితే, ఆ సినిమాలు ఆమెకు అంతగా కలిసి రాలేదు. అదీ గాక ఇప్పుడు సినిమాపై బజ్ లేదు.. కాని సోనాల్ చౌహాన్ అందాల ఆరబోత, బికినీ ట్రీట్ సాంగుల్లో చూసేందుకు బాగుంది.. మరి ఆమె సెంటిమెంట్ అయినా రిపీట్ అయ్యి రూలర్ హిట్ లేదా యావరేజ్ అవుతుందా.. లేదా అనేది తెలియాలంటే రిలీజ్ దాక ఆగవలసిందే అని అనుకొంటున్నారు..