రూల‌ర్‌:  వేదిక - స‌ప్త‌గిరి ల‌వ్ ట్రాక్ ఏమైందంటే....??

Mari Sithara

గత ఏడాది తనకు జైసింహా వంటి మంచి సినిమాని అందించిన కేఎస్ రవికుమార్ కు బాలయ్య మరొక్కసారి తన ప్రస్తుత సినిమా రూలర్ కు దర్శకత్వం వహించే ఛాన్స్ ఇచ్చారు. జులై లో ప్రారంభం అయిన ఈ సినిమా కేవలం నాలుగంటే నాలుగు నెలల్లో పూర్తి అయి, నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలయ్య మూడు రకాల విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలు పోషించిన ఈ సినిమాపై ప్రేక్షకుల నుండి కొంత మిశ్రమ స్పందన వినపడుతోంది. చాలావరకు ప్రేక్షకులు మాత్రం సినిమా ఊహించిన రేంజ్ లో లేదని, మూస పద్ధతి కథ, కథనాలతో సాగుతుందని అంటున్నారు. 

 

కేవలం ఈ సినిమాను బాలయ్య తన ఫ్యాన్స్ కోసమే తీసినట్లుందని, ఓవర్ ఆల్ గా అయితే ఒక్కసారి చూసి వచ్చే సినిమా మాదిరిగా అనిపిస్తోందని చెప్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య డైలాగ్స్, డాన్స్, ఫైట్స్ వంటివి అదిరిపోయాయని, అలానే ఈ సినిమాలో కామెడీ కూడా బాగుందని అంటున్నారు. సినిమా మధ్యలో హీరోయిన్ వేదిక‌ను స‌ప్త‌గిరి ప్రేమిస్తూ ఉంటాడు. ఆమె మాత్రం బాల‌య్య‌ను ప్రేమిస్తుంది, తరువాత వారిద్ద‌రికి ఎంగేజ్‌మెంట్ కూడా జ‌రుగుతుంది. 

 

అయితే స‌ప్త‌గిరికి వేదిక ఇచ్చిన స్ట్రోక్‌తో స‌ప్త‌గిరి గాలి వాన‌లో డ్యూయెట్  ఏసుకుంటాడు. ఆ వెంట‌నే వేదిక బాల‌య్య‌తో యాల యాల ఉయ్యాలా మిలా మిలా కుర్రం కుల్లా సాంగ్ తో గాల్లో తేలిపోతుంది. ఈ సరదా కామెడీ సన్నివేశం సినిమాలో బాగా పండిందని అంటున్నారు. అలానే మరొక సాంగ్ లో కూడా బాలయ్య తన స్టెప్స్ తో థియేటర్స్ ని ఊపేసాడని చెప్తున్నారు. దర్శకుడు కేఎస్ రవికుమార్ తన సినిమాల పంథాను మార్చాలని, కొన్నేళ్ల క్రితం తీసిన తన పాత సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా తీసాడని అంటున్న ప్రేక్షకులు కూడా లేకపోలేదు. మరి ఎన్నో అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఓవర్ ఆల్ గా ఎంతవరకు సక్సెస్ ని, కలెక్షన్ ని అందుకుని ముందుకు సాగుతుందో చూడాలి......!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: