ఆ విషయంలో రవితేజ అసంతృప్తి... తప్పని 'డిస్కోరాజా' రీషూట్.?

praveen

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ... తెలుగు ప్రేక్షకులందరినీ తన మాస్ డైలాగులతో తన కామెడీ టైమింగ్ తో అలరిస్తూ ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నాడు మాస్ మహారాజా. కానీ గత కొంతకాలంగా మాత్రం రవితేజకు అంతగా టైం కలిసి రావడం లేదు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో పవర్ ఫుల్ టైటిల్ ఉన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ రవితేజ సినిమా లోని కథ కథాంశం మాత్రం ప్రేక్షకులను మెప్పించలేక సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. ఒకప్పుడు వరుస హిట్ సినిమాలతో దూసుకుపోయిన రవితేజ ఇప్పుడ వరుసగా ఫ్లాపులు అందుకుంటున్నాడు. ఇక  త్రిపాత్రాభినయం చేసినప్పటికీ కూడా రవితేజ హిట్ కొట్టలేకపోయారు. 

 

 

 అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో  కిక్కిచ్చే  కాంబినేషన్ అయిన ఇలియానా తో నటించి త్రి పాత్రాభినయం చేసినప్పటికీ కూడా రవితేజ విజయం సాధించలేకపోయారు. ఇక ఆ తర్వాత నేల టికెట్ తో ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ప్రేక్షకుల ఆదరణ మాత్రం పొందలేకపోయారు రవితేజ. ప్రస్తుతం డిస్కో రాజా సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు రవితేజ. దర్శకుడు విఐ ఆనంద్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. డిస్కో రాజా కథ మొత్తం సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగుతుంది. అయితే ఈ సినిమాలోని కొన్ని సీన్లను రవితేజ రీషూట్ చేయాలని భావిస్తున్నారట. 

 

 

 దీనికి కారణం సైన్స్ ఫిక్షన్ కి  సంబంధించి కొన్ని అంశాల్లో స్పష్టత లోపించడం వల్ల హీరో రవితేజ అసంతృప్తి వ్యక్తం చేశారట . అందుకే సినిమా చూస్తున్న ఆడియో ఎక్కువ కన్ఫ్యూజన్ కి గురి కాకూడదనే ఉద్దేశంతో ఆయన కొన్ని మార్పులు చేయాలని దర్శకుడికి సూచించాడట. అందుకు తగ్గట్లుగానే కొన్ని సన్నివేశాలను రీషూట్ చేస్తున్నట్లు  సమాచారం. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని పట్టుదలతో రవితేజ ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రీషూట్ కి సంబంధించిన కార్యక్రమాలు కూడా పూర్తవుతాయట. సినిమాకి సంబంధించి అన్ని పనులు పూర్తి చేసి జనవరి 24న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం భావిస్తోంది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: