డిస్కోరాజాలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అదిరిందిగా...?
సైంటిఫిక్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రమిది. ఇప్పటికే విడుదల చేసిన తొలి పాట, ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించాయి. జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేస్తూ రూపొందిస్తున్న చిత్రమిది. సైన్స్ ఫిక్షన్‌తో కూడిన యాక్షన్ థ్రిల్లర్‌గా, అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న చిత్రబృందం తెలిపింది. బాబీ సింహా, వెన్నెల కిషోర్, సత్య, సునీల్, రామ్‌కి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, సంభాషణలు: అబ్బూరి రవి, ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని. ముఖ్యంగా ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామా లో సైన్స్ కు సంభందించిన ఎలిమెంట్స్ సరిగ్గా డీల్ చేయలేదని ఫీలవుతున్నట్లు సమాచారం. అయితే దీన్ని మళ్ళీ రీ షూట్ చేద్దామని అనుకుంటున్నాడని సమాచారం. రీ షూట్ అంటే నిర్మాతలు భయపడుతున్నారంట. కానీ దర్శకుడు మాత్రం తన ప్రొడక్షన్ పై పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉన్నాడని సమాచారం. కానీ రవితేజ ..ఈ విషయమై పట్టుపడుతున్న నేపధ్యంలో రీషూట్స్ పెట్టాలా వద్దా అనే విషయమై గత కొద్ది రోజులుగా డిస్కషన్స్ జరుగుతున్నట్లు మీడియా సమాచారం.