ఇచ్చట వాహనములు నిలపరాదు.. పోలిస్సా? సినిమానా ?
కాళిదాసు సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన హీరో సుశాంత్.. ఆ సినిమా అనుకున్నంత హిట్‌ని అందించలేక పోయింది.. దానితో కొంచెం గ్యాప్ తీసుకొని మరో సినిమాలో నటించారు. ఈ సినిమా కరెంట్.. సినిమాలో కథ నచ్చడం తో.. సినిమా సూపర్ హిట్ అయ్యింది. దీనితో సినిమా అనుకున్న దానికంటే ఎక్కువగానే పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత మరో సినిమాలో నటించారు.
`చిలసౌ` సినిమాతో హిట్ ట్రాక్‌లోకి వచ్చిన అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ మరో ఇంట్రస్టింగ్ సినిమాకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరో గా తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో సినిమాలో చిన్న పాత్రలో నటిస్తున్న ఈ హీరో మరో సినిమాలో నటిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాకు `ఇచ్చట వాహనములు నిలపరాదు` అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
కాగా, ఈ సినిమా షూటింగ్ జనవరి లో ప్రారంభం కానుంది. చాలా రోజులుగా సరైన కథ కోసం ఎదురుచూస్తున్న సుశాంత్ ఎస్ దర్శన్ చెప్పిన కథను గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. టైటిల్ పోస్టర్ లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌తో పాటు టైటిల్‌తో ఉన్న సైన్ బోర్డ్‌ను చూపించారు. పోస్టర్ ఆకట్టుకునేలా ఉండటం తో ఈ చిత్రం పై భారీ అంచనాలున్నాయి.
ఇక ఈ సినిమా ఏఐ స్టూడియోస్, శాస్త్రా మూవీ బ్యానర్లపై రవి శంకర్ శాస్త్రి, హరీష్ కోయలగుండ్లలు నిర్మిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతమివ్వనున్నాడు. ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. వెన్నెల కిశోర్, ప్రియదర్శి, అభినవ్ గోమటం, ఐశ్వర్య, నిఖిల్ కైలాస, కృష్ణ చైతన్య తదితరులు కీలక పాత్ర ల్లో నటిస్తున్నారు. సుశాంత్ సరసన హీరోయిన్ను వెతికే పని లో చిత్ర యూనిట్ ఉన్నారు. ఈ సినిమా అతనికి హిట్‌ని ఇస్తుందేమో చూడాలి..