చరణ్ లో బయటపడ్డ మరోకోణం షాక్ అయిన ఇండస్ట్రీ వర్గాలు !

Seetha Sailaja

చిరంజీవి నట వారసుడుగా ఎదుగుతున్న రామ్ చరణ్ తన నటన డాన్స్ లు యాక్షన్ సీన్స్ లో ఇప్పటికే మెగా అభిమానుల మన్నలను పొందాడు. ప్రస్తుతం టాప్ యంగ్ హీరోల లిస్టులో కొనసాగుతున్న చరణ్ నెంబర్ వన్ స్థానానికి ఎదగడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తూ టాప్ హీరోల రేసులో పరుగులు తీస్తున్నాడు. 

ఇలాంటి సమయంలో చరణ్ కు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు లీక్ అయింది. చరణ్ కు మూగ జీవాలు అంటే విపరీతమైన ప్రేమ అన్న విషయం తెలిసిందే. దీనితో చరణ్ ఫామ్ హౌస్ లో లెక్కకు మించిన గుర్రాలు కుక్కలు పక్షులు ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి. వీటిని ప్రేమగా చూసుకోవడం కోసం చరణ్ ప్రత్యేకమైన సిబ్బందిని ఏర్పాటు చేసి లక్షలలో ఖర్చు పెడుతున్నాడు. 

అయితే ఇప్పుడు చరణ్ హీరోగా మాత్రమే కాకుండా వైల్డ్ లైఫే ఫోటోగ్రాఫర్ గా ఒక కొత్త అవతారం ఎత్తాడు. దట్టమైన అరణ్యాలలోకి వెళ్ళి అక్కడి వన్య ప్రాణులను దగ్గరగా చూస్తూ వాటికి ఫోటోలు తీయడం చరణ్ హాబి. ఈమధ్య చరణ్ ఉపానలు ఇద్దరు కలిసి ఆఫ్రికాలోని అటవీ ప్రాంతానికి విహార యాత్రగా వెళ్ళారు. అక్కడ వారు అనేక రకాల వన్య ప్రాణులను దగ్గర నుండి చూడటమే కాకుండా వాటికి సంబంధించిన ఫోటోలను కొన్ని వందల సంఖ్యలో తమ కెమెరాలతో తీసారు. 

ఇప్పుడు ఆఫోటోలను అన్నింటిని చాల అందమైన ఫ్రేమ్స్ లో బంధించి చరణ్ చిరంజీవిలు కొత్తగా కట్టుకున్న ఇంటిలోని ఒక పెద్ద హాలులో ఫోటో ఎగ్జిబిషన్ గా ఏర్పాటు చేసాడు. ఇప్పుడు ఆ ఫోటోలను చూడటానికి ఇండస్ట్రీకి సంబంధించిన అనేకమంది హీరోలు హీరోయిన్స్ చరణ్ ఇంటికి వస్తు ఆ ఫోటోలను చూసి ఆశ్చర్యపోవడమే కాకుండా చరణ్ లో కొత్తగా బయటపడ్డ ఈ యాంగిల్ పై విపరీతమైన ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో కూడ షేర్ చేయబడటంతో చరణ్ అభిమానులు తమ విపరీతంగా ప్రశంసలు కురిపిస్తున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: