ఆ విషయంలో రామ్ చరణ్‌కు  ఎందుకు ప్రభాస్ అడ్డుపడుతున్నాడు...?

Suma Kallamadi

 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అడుగడుగున అడ్డుపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు  ప్రభాస్ ఏంటి రామ్ చరణ్‌కు అడ్డుపడటం ఏమిటి ఐ అనుకుంటున్నారా  ? అవును ఇది నిజం..ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. గత కొన్ని రోజులగా రామ్ చరణ్.. కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ‘మిర్చి’ సినిమా తర్వాత రామ్ చరణ్, కొరటాల శివ కాంబినేషన్‌లో బండ్ల గణేష్ నిర్మాణంలో సినిమా మొదలు అవ్వడం జరిగింది. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ సినిమా తెరమీదకు రాలేదు. అనంతరం  కొరటాల శివ.. మహేష్ బాబు‌తో ‘శ్రీమంతుడు’, ఎన్టీఆర్‌తో జనతా గ్యారేజ్  సినిమాలు కూడా తీయడం జరిగింది.

 

ఇది ఇలా ఉండగా గతంలో  మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో రామ్ చరణ్, కొరటాల శివ సినిమా కూడా సరే అనుకున్నారు కానీ ఆ సినిమా ఇప్పటి వరకు సెట్ పైకి రాలేదు అంటే నమ్మండి. ఇటీవల మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కోసం రామ్ చరణ్ ఇచ్చిన డేట్స్‌ను తండ్రి చిరంజీవి సినిమా కోసం కేటాయించడం జరిగింది.  ఈ సినిమా షూటింగ్ ఈ నెలలో ప్రారంభం అవుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

 

 

ఈ సినిమాకు  మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రామ్ చరణ్ నిర్మాతగా వహిస్తున్నాడు. కానీ ఈ సినిమా తర్వాత రామ్  చరణ్, కొరటాల శివ మొదలు అవుతుంది అని అనుకుంటే .కానీ ఇంతలో  ప్రభాస్.. తన నెక్ట్స్ సినిమా కొరటాల శివతో చేయాలనే ఆలోచనలో ఉన్నాడు అని తెలుస్తుంది.అంతేకాదు ఇప్పటికే కొరటాల శివ‌ను తన సినిమా కోసం లాక్ చేసినట్టు కూడా ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

 

ప్రభాస్ కూడా ఒక్క సినిమాతో బాగా  అనుభవం ఉన్న సుజిత్‌తో ‘సాహో’ సినిమా చేసి అంతగా విజయం సొంతం చేసుకోలేదు. ఆ తర్వాత రాధాకృష్ణ దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నా ఈ సినిమా కథపై ప్రభాస్ అనుమానంగా ఉన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే  రాధాకృష్ణ సినిమా అనంతరం తన యూవీ క్రియేషన్ బ్యానర్‌లో తనకు ‘మిర్చి’ వంటి మంచి సూపర్ హిట్ తీసుకొని వచ్చిన  కొరటాల శివతో తన తర్వాతి సినిమా చేసి  బంపర్ హిట్ సొంతం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు ప్రభాస్.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: