రాధ లో ఆమే హీరోయిన్

Narayana Molleti
మొన్నటిదాకా బూతు సినిమాల స్పెషలిస్ట్ గా ఓవర్ డోస్ తో సినిమాలను తీసి తనను తాను సమర్దించుకున్న దర్శకుడు మారుతి. చిన్న సినిమాగా మొదలైన ఆయన సినిమా ప్రస్థానం ఇప్పుడు పెద్ద హీరోతో సినిమా చేసే స్థాయికి ఎదిగాడు. మారుతి మొత్తానికి విక్టరీ వెంకటేష్ తో సినిమా చేస్తున్నాడు. వెంకటేష్ ఇప్పటి వరకు చేయని పొలిటీషియన్ క్యారక్టర్ లో చూపించబోతున్నాడు ఈ డైరక్టర్. ఈ సినిమా టైటిల్ కూడా రాధ అని పెట్టేశారు. డీవివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు హీరోయిన్ గా నయనతారనే తీసుకున్నారట దర్శక,నిర్మాతలు. తమిళ్ లో రాజా-రాణి హిట్ తో మంచి కిక్ మీదున్న నయన్ ప్రస్తుతం శేఖర్ కమ్ముల అనామిక షూట్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంది. ఇక ఈ సినిమా స్టోరీ లైన్ నచ్చి సినిమాను ఓకే చేసిందట నయనతార.. మరి సూపర్ క్రేజ్ సంపాదించిన వెంకీ,నయన్ కాంబినేషన్ లో ఇదవరకే లక్ష్మి,తులసి వంటి సినిమాలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి. మరి మరోసారి జతకడుతున్న ఈ జంట వారు తీసిన ముందు సినిమాల్లానే సూపర్ హిట్ అవ్వాలని ఆశిద్దాం. మొదటి సారిగా ఈ సినిమాతోని ఓ పెద్ద ఫిల్మ్ గా రాబోతున్న రాధ సినిమా మారుతికి మంచి బ్రేక్ ఇవ్వాలని కోరుకుందాం. అసలే ఫ్లాప్స్ తో వెనుకపడ్డ వెంకీ కి ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కూడా ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: